Jio Recharge Plans: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కొత్త రీఛార్జ్ ప్లాన్, మరెన్నో బెనిఫిట్స్!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల ఆఫర్లతో తరచూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జియో భారత్ ఫోన్ వినియోగదారులకు కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల ఆఫర్లతో తరచూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జియో భారత్ ఫోన్ వినియోగదారులకు కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.

నేటికాలంలో స్మార్ ఫోన్ వినియోగం అనేది బాగా పెరిగి పోయింది. ఈ మొబైల్ ఫోన్  లేని వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇక ఫోన్ వినియోగం పెరగడంతో టెలికాం సంస్థలు కూడా అనేక రకాల రీచార్జ్ ప్లాన్ ఆఫర్లు ఇస్తుంటారు. ఇక కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు పోటీ పడి మరీ కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. భిన్నమైన ఆపర్లు, నిర్ణయాలు  ప్రకటించడంలో దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ముందుకు ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో జియో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంది. తాజాగా ఐపీఎల్ సీజన్ 17 జరుగుతోన్న నేపథ్యంలో కొత్త రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించింది. అలానే మరెన్నో బెనిఫిట్స్ ను వెల్లడించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల ఆఫర్లతో తరచూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జియో భారత్ ఫోన్ వినియోగదారులకు కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. జియో భారత్ 4జీ ఫోన్ ను ప్రస్తుతం రూ. 999కి విక్రయిస్తోంది. అయితే, ఈ ఫోన్ అసలు రిటైల్ ధరలో ఎలాంటి మార్పులు  లేనప్పటికీ, క్రికెట్  ఫ్యాన్స్ మెరుగైన ప్రయోజనాలతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు.

ఎంఎన్పీ లేదా ఇప్పటికే  జియో సిమ్ లో కొత్త రూ.234 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు రెండు నెలల ఫ్రీ ప్లాన్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ 2024లు ఏప్రిల్  1 లేదా ఆ తరువాత విక్రయించే జియో భారత్ ఫోన్లకు మాత్రమే , ఆ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్ పై ఆసక్తిగల కస్టమర్లు ముందుగై ఏదైనా మొబైల్ స్టోర్ కి వెళ్లి కొత్త జియో భారత్ 4జీ ఫోన్ ను కొనుగోలు చేయాలి. ఆ తరువాత కొత్త జియో సిమ్ లేదా ఇప్పటికే ఉన్న జియో సిమ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక జియో కంపెనీ తెలిపిన ప్రకారం..ఆఫర్ పోర్ట్-ఇన్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ జియో భారత్ వినియోగదారులు 234 రూపాయ ప్లాన్‌తో తమ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ ను తీసుకున్న జియో భారత్ కస్టమర్లకు రోజుకు 0.5జీబీ డేటాతో పాటు 2 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను పొందవచ్చు.

ఈ ప్యాక్ తో పాటు అదనంగా మరో రెండు నెలల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది జియో కంపెనీ. అయితే ఆ సమయంలో డివైజ్ లో ఉన్న సిమ్  15 రోజుల రీఛార్జ్ తర్వాత ఈ బెనిఫిట్ క్రెడిట్ అవుతుంది. అప్పుడే మాత్రమే అదనంగా రెండు నెలల ఉచిత ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ జియోభారత్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే పనిచేస్తుంది.ఈ జియోభారత్ ఫోన్‌కు కూడా ఒకసారి మాత్రమే లేటెస్ట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఇటీవలే కీలక విషయాలను ప్రకటించారు. జియో సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే సహకారంతో ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌పై పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. జియో 2.0 విజన్‌ను సాకారం చేసే దిశగా కంపెనీ నిబద్ధతను ఆకాశ్ అంబానీ వివరించారు. మొత్తంగా జియో భారత్ యూజర్లకు సదరు సంస్థ ఇస్తున్న ఈ కొత్త ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments