Arjun Suravaram
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి కావాలనే కోరిక ఉంటుంది. అలానే చాలా మందికి ఐఏఎస్ అయ్యే ప్రజలకు సేవ చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో ఐఏఎస్ అయ్యేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తుంటారు. కొందరు తొలిసారే విజయం సాధించగా.. మరికొందరు చాలా సార్లు ప్రయత్నాలు చేసి.. విజయం అందుకుంటారు. అలా ఎంతో కష్టపడితే వచ్చిన ఉద్యోగాని ఎవరైనా వదులుకుంటారా?. కానీ ఓ యువకుడు మాత్రం యువత కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు.
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ ప్రాంతానికి చెందిన రోమన్ సైనీ.. ఓ వైద్య కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబంలో మొత్తం 12 మంది వైద్యులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని సైనీ కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. అలానే జాతీయ స్థాయిలో అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి.. తొలి ప్రయత్నంలో విజయం సాధించారు. అప్పటికే ఆయన వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. దీంతో భారతదేశంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన అతి చిన్న వయస్కుడిగా సైనీ రికార్డు సాధించారు. అయితే సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్స్ పరీక్షలు రాయాలని అనుకున్నారు. ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. దీంతో సివిల్స్ పరీక్షలు రాసి.. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ గా ఎంపికయ్యారు.
మధ్యప్రదేశ్ క్యాడర్ కింద జబల్ పూర్ అస్టిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా సైనీ వివిధ ప్రాంతాల్లో పర్యటించే వారు. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనే స్వయంగా చూశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నట్లు సైనీ గుర్తించాడు. ఎందుకంటే అక్కడి వారికి ఉద్యోగ అవకాశలపై అవగాహన తక్కువ. అలానే వారికి సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేకపోవడంతో కూడా ఇందుకు ప్రధాన కారణం. కోచింగ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో చాలా మంది యువత ఉన్నట్లు గుర్తించారు. వారికి ఆన్ లైన్ కోచింగ్ ఇప్పించాలని భావించి.. తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేషే సింగ్ తో కలిసి ‘అన్ అకాడమీ’ పేరుతో ఆన్ లైన్ ట్యూటోరియల్ ను ప్రారంభించారు.
ఈ అకాడమీ ప్రచారానికి సోషల్ మీడియాను సాధానంగా ఉపయోగించుకున్నారు. అన్ని రకలా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సంబంధించిన మెటిరీయల్స్ శిక్షణ వంటివి అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా సుమారు 3 లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్ అకాడమీలో 20 వేల మందికి పై బోధనా సిబ్బంది ఉన్నారు. తక్కువ ఖర్చుతో అనుకున్నది సాధించాలనుకునే వారికి ఈ అకాడమీ ఒక వరం అనే చెప్పాలి. ప్రస్తుతం అన్ అకాడమీ అనేది రూ.2600 కోట్ల సంస్థగా అవతరించింది. ఈ ఘనత మొత్తం మాజీ ఐఏస్ అధికారి రోమన్ సైనీకే చెందుతుంది. మరి.. యువత కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన రోమన్ సైనీ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.