కస్టమర్లకు జియో షాక్‌.. ఆ రీచార్జ్‌ ప్లాన్‌ను తీసేసింది!

దిగ్గజ టెలికాం నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. మినిమం రీచార్జ్‌ ప్లాన్‌లో మార్పులు తీసుకువచ్చింది. మినిమం రీచార్జ్‌ ప్లాన్‌ అయిన 119ను తొలగించింది. ప్రస్తుతం ఈ మినిమం రీచార్జ్‌ ప్లాన్‌ను తమ అఫిషియల్‌ జియో యాప్‌ నుంచి తొలగించింది. ఇప్పుడు మినిమం రీచార్జ్‌ ప్లాన్‌ 149 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రీచార్జ్‌ కేవలం 20 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. ఇక, 119 రీచార్జ్‌ ప్లాన్‌ ద్వారా అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, ప్రతీ రోజూ 1.5 జీబీ డేటాతో పాటు ప్రతీ రోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు.

ఈ రీచార్జ్‌ కేవలం 14 రోజులకు మాత్రమే వచ్చేది. వీటితో పాటు గతంలో ఉన్న 99 రీచార్జ్‌ ప్లాన్‌ను కూడా జియో తొలగించింది. 119 ప్లాన్‌తో పోల్చుకుంటే 149 ప్లాన్‌ ఎంతో మేలని చెప్పుకోవచ్చు. ఇది 20 రోజుల వాలిడిటీని కలిగి ఉండటంతో పాటు.. ప్రతీ రోజూ 1 జీబీ డేటా వస్తుంది. దీనితో పాటు ప్రతీ రోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంతేకాదు! ఈ ప్లాన్‌ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్చన్‌లు వర్తిస్తాయి. 2017లో జియో 4జీ సర్వీస్‌లను ప్రారంభించింది. మొదట్లో ఉచితంగా ఇంటర్‌ నెట్‌ను అందించింది.

దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న జనం ఎగబడి జియో సిమ్‌ కొన్నారు. తర్వాత జియో పెయిడ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకు ఎక్కువ జీబీని అందిస్తుండటంతో మిగిలిన నెట్‌వర్క్‌ వాళ్లు కూడా జియోకు మారారు. ప్రత్యర్థి నెట్‌వర్క్‌లు అయిన ఎయిర్‌టెల్‌, వడాఫోన్‌, ఐడియాలనుంచి కస్టమర్లు జియోకు క్యూలు కట్టారు. ప్రస్తుతం జియోకు దేశ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. మరి, జియో మినిమం రీచార్జ్‌ ప్లాన్‌ను తొలగించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments