Jio Offer: జియో గుడ్ న్యూస్.. తక్కువ ధరల్లో హై స్పీడ్ నెట్.. 15 OTT యాప్స్ ఫ్రీ!

మెట్రో నగరాల్లో తక్కువ ధరలో ఇంటర్నెట్ పొందేందుకు అనేక అవకాశాలు, ఛాన్స్ లు ఉన్నాయి. అయితే చిన్న చిన్న పట్టణాలు, టౌన్లు, గ్రామాల్లో అయితే ఎప్పుడూ ఇంటర్నెట్ కొరత ఉంటుంది. ఇలాంటి సమయంలో జియో ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

మెట్రో నగరాల్లో తక్కువ ధరలో ఇంటర్నెట్ పొందేందుకు అనేక అవకాశాలు, ఛాన్స్ లు ఉన్నాయి. అయితే చిన్న చిన్న పట్టణాలు, టౌన్లు, గ్రామాల్లో అయితే ఎప్పుడూ ఇంటర్నెట్ కొరత ఉంటుంది. ఇలాంటి సమయంలో జియో ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కస్టమర్లను ఆకట్టుకోవడంలో దీనికి పోటీ ఎవరు రాలేరు అంటే అతిశయోక్తి కాదు.  కారణం.. ఎప్పటికప్పుడు విభిన్నమైన ప్లాన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అనేక ఆఫర్లతో మామురుల గ్రామాలకు సైతం జియో విస్తరించింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా జియో నుంచి మరో అదిరిపోయే ప్లాన్ వచ్చింది. చౌకదరల్లోనే హైస్పీడ్ ఇంటర్ నెట్, 15 ఓటీటీ యాప్స్ ఉచితంగా పొందవచ్చు. మరి..జియో అందిస్తున్న ఈ ప్లాన్ల గురించి ఇప్పుడు కాస్తా తెలుసుకుందాం…

మెట్రో నగరాల్లో తక్కువ ధరలో ఇంటర్నెట్ పొందేందుకు అనేక అవకాశాలు, ఛాన్స్ లు ఉన్నాయి. అయితే చిన్న చిన్న పట్టణాలు, టౌన్లు, గ్రామాల్లో అయితే ఎప్పుడూ ఇంటర్నెట్ కొరత ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా మెరుగైన సేవలు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే జియో అందిస్తున్న ఇంటర్నెట్ సౌకర్యాలు, ఆఫర్ల గురించి తెలుసుకుందాము. జీయో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ విషయంలో కీలక విషయాలు ఉన్నాయి. జియో అధిక వేగంతో ఇంటర్నెట్‌ని అందిస్తుంది. అంతేకాదు మీకు 15 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ని కూడా అందిస్తుంది. ఈ రెండిటితో  పాటు, మీరు ఒకేసారి మీ కుటుంబ సభ్యుల ఫోన్లకు ఇంటర్నెట్‌ను కూడా వినియోగించవచ్చు.  ఇక జియో ఫైబర్ నెట ప్లాన్ వివరాల్లోకి వెళ్తే.. రూ.599 అనే ప్రారంభ ప్లాన్ అందుబాటులో ఉంది. దీనికి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే నెలకు రూ.701 అవుతుంది.

ఇక ఈ రూ.599 ప్లాన్ లో 1000జీబీ డేటా అందుటాబులో ఉంటుంది. అదే విధంగా ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ వేగం ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 30 నుండి 40ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగం అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేకతలతో పాటు 15 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచిత పొందవచ్చు. 599 రూపాయల ప్లానే కాకుండా మరికొన్ని ప్లాన్లను కూడా జియో అందుబాటులో ఉంచింది. రూ.899, రూ.1199 రీఛార్జ్ ఆఫర్లు  అందుబాటులో ఉన్నాయి. వీటిని కస్టమర్లు వారు వినియోగించే డేటాకు అనుగుణంగా తీసుకోవచ్చు.

జియో ఎయిర్ ఫైబర్ అనేది వైర్ లెస్ ఇంటర్నెట్ సేవ. వైర్లతో కూడిన వైపై సేవలు అందుబాటులో లేని, అలా వీలు కానీ గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో జియో ఎయిర్ ఫైబర్ ను ఇన్ స్టాల్ చేయవచ్చు. దీనిని తీసుకోవాలని భావించే వారు మై జియో అనే యాప్ ను ఇన్ స్టాలేషన్  చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిక్వెస్ట్ పెట్టిన తరువాత దీనికి కొంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కీనీ రూ.1000 ఇన్ స్టాలేషన్ ఛార్జీని చెల్లించాలి. అయితే ఏడాది ప్లాన్ తీసుకున్న వారికి ఈ ఇన్ స్టాలేషన్ ఫీజు ఉండదు.

ఇక ఈ జియో ఎయిర్ ఫైబర్ లో 10ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తారు. ఇదే సమయంలో మనం సెక్యూరిటీ డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా వినియోగాదారులను ఆకట్టుకునేందుకు జియో 599 రూపాయల నుంచి సరసమైన ఆఫర్లను ప్రారంభించింది. జియో కంపెనీ తన స్థిర బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీతో 15 స్ట్రీమింగ్ యాప్‌లను కలిగి ఉన్న స్ట్రీమింగ్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. మొత్తంగా జియో అందిస్తున్న ఈ ఇంటర్నెట్ ప్లాన్ ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments