చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు.. రూ.5 లక్షల్లోపే ధర.. 24KM మైలేజ్!

Best Budget Car Suggestion: మధ్యతరగతి కుటుంబానికి కారు కొనాలి అంటే కాస్త పెద్ద విషయమే అవుతుంది. అలాంటి వారి కోసం ఒక బడ్జెట్ బెస్ట్ కారును తీసుకొచ్చాం.

Best Budget Car Suggestion: మధ్యతరగతి కుటుంబానికి కారు కొనాలి అంటే కాస్త పెద్ద విషయమే అవుతుంది. అలాంటి వారి కోసం ఒక బడ్జెట్ బెస్ట్ కారును తీసుకొచ్చాం.

కారు కొనాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ఎంతలో కొనాలి? మన బడ్జెట్ లో మంచి కార్లు అందుబాటులో ఉన్నాయా? తక్కువ బడ్జెట్ లో కారు తీసుకోవాలి అంటే మంచి కార్లు అందుబాటులో ఉంటాయా? అనే సందేహాలు మాత్రం మధ్యతరగతి వారిలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ కోసం బెస్ట్ బడ్జెట్ కారు కోసం చూస్తున్న వారికోసం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. నిజానికి మార్కెట్ లో రెండు దశాబ్దాలకు పైగా ఈ కారుకు ఆదరణ ఉంది. ఇప్పటికీ మారుతున్న అసరాలకు అనుగుణంగా ఈ కారును కూడా అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. మరి.. ఆ కారు ఏది? దాని ఫీచర్స్, ధర ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో కే10 గురించి. సాధారణంగానే బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అనగానే అందరికీ మారుతీ కార్లే గుర్తొస్తాయి. పైగా వీటి మెయిన్టినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆల్టో కారు 2010లో ప్రారంభమైనా.. ఇప్పటికీ ఈ మోడల్ పై వినియోగదారుల నుంచి మక్కువ తగ్గడం లేదు. అందుకే ఆ మోడల్ ని అప్ గ్రేడ్, మోడిఫికేషన్స్ చేస్తూ 2022 ఆగస్టు నుంచి ఆల్టో కే10 తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కారుకు 2023, 2024 మోడల్స్ కూడా వచ్చాయి. మార్కెట్ లో ఉన్న బడ్జెట్ హ్యాచ్ బ్యాక్స్ గురించి సెర్చ్ చేస్తే ఆల్టో కే10 కచ్చితంగా వన్ ఆఫ్ ది ఆప్షన్ గా ఉంటుంది.

ఈ కారు ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ.3.99 లక్షల నుంచే ప్రారంభం అవుతుంది. హైఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.96 లక్షలుగా ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే.. ఆల్టో కే10 మోడల్ బేస్ మోడల్ మీకు రూ.5.70 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇందులో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. 4 సీటర్, 5 సీటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్యూయల్, మోడల్ మారే కొద్దీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఫీచర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కారు పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.

ఈ ఆల్టో కే10 కారు 998 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోంది. 55.92 బీహెచ్పీ పవర్, 5300 ఆర్పీఎం జనరేట్ చేస్తుంది. 82.1 ఎన్ఎం మాక్సిమమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. సీఎన్జీ మోడల్ అయితే 31 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అదే పెట్రోల్ వర్షన్ లో అయితే.. లీటరుకు 24 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంక ఫీచర్స్ చూస్తే.. పవర్ స్టీరింగ్, రేర్ కార్ పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్, ఈబీడీ, ఫ్రంట్ డిస్క్/బ్యాక్ డ్రమ్ బ్రేక్స్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. 214 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఒక చిన్న కుటుంబానికి ఈ కారు ది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పచ్చు. మరి.. ఆల్టో కే10 ధర, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments