1964 Ambassador Car Bill: 1964‌లో అంబాసిడర్ కారు ధర ఎంతంటే..! నెట్టింట బిల్లు ఫోటో వైరల్

1964‌లో అంబాసిడర్ కారు ధర ఎంతంటే..! నెట్టింట బిల్లు ఫోటో వైరల్

భారతీయులకు అంబాసిడర్ కారు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘అతడు’ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్టు.. బెంజ్ కారు అందరూ బాగుంది అంటారు.. కానీ అంబాసిడరే కారే కొంటారు. నిజంగా అంబాసిడర్ కారు గొప్పతనం అలాంటిది. దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతీయ రోడ్లపై హవా చూపించింది ఒక్క అంబాసిడర్ కారే అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకే ఈ కారును అప్పట్లో ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ గా పిలిచే వారు. 90వ దశాబ్ధంలో ఈ కారు ఉంటే.. అది ధనవంతుల స్టేటస్ సింబల్ గా భావించేవారు. దశాబ్దాల పాటు ఫోర్ వీలర్ మార్కెట్ లో ఒక ట్రెండ్ సృష్టించింది అంబాసిడర్ కారు. తాజాగా ఒకప్పటి అంబాసిడర్ కారుకు సంబంధించిన బిల్లు (ఇన్ వాయిస్) నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు భారతదేశ రోడ్లపై చక్కర్లు కొట్టిన అంబాసిడర్ కారు ఆటోమొబైల్ మార్కెట్ లో లెజెండ్ గా చెప్పుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గుట్టు ఈ కారు అప్ డేట్ కాకపోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో 2014 నుంచి ఈ కార్ల తయారీ పూర్తిగా ఆపివేశారు. అప్పట్లో ఎలాంటి మట్టిరోడ్డుపై అయినా ఈ కారు రయ్.. రయ్ అంటూ దూసుకు వెళ్లేది. చాలా వరకు ఈ కార్లు తెలుపు, నలుపు రంగుల్లో ఉండేవి. ఈ అంబాసిడర్ కార్లను రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు, సంపన్నులు ఎక్కువగా వాడేవారు. అంతేకాదు ఈ కార్లను ఒకప్పుడు సినిమాల్లో బాగా ఉపయోగించేవారు. మార్కెట్ లో ఎన్ని రకాల కార్లు వచ్చినప్పటికీ.. అంబాసిడర్ కారు కి ఉన్న క్రేజ్ వేరే అని చెప్పొచ్చు. ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉంటే వారు మంచి స్థితిమంతులుగా భావించేవారు.

1990 దశకం వరకు అంబాసిడర్ కారు హవా కొనసాగింది. రాను రాను విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోయింది. దీంతో ఈ కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. 1957లో అంబాసిడర్ కారు ను హిందూస్థాన్ మోటర్స్ విడుదల చేశారు. ఈ కారు బ్రిటీష్ కారు ఆధారంగా రూపొందించారు. ప్రస్తుత కాలంలో కొత్త తరం కోసం.. కొత్త టెక్నాలజీతో ఎన్నో రకాల కార్లు వస్తున్నాయి. దీంతో అంబాసిడర్ కారు అమ్మకాలు తగ్గడంతో 2014 నుంచి హిందూస్థాన్ మోటర్స్ వీటి తయారీ పూర్తిగా నిలిపివేసింది. అప్పట్లో ఈ కారు ధర నాలుగు లక్షలకు పైగా ఉండేది. కాకపోతే ఈ కారు మార్కెట్ లోకి వచ్చిన కొత్తలో ధర వేరుగా ఉండేది. తాజాగా 1964లోని అంబాసిడర్ కారు ఇన్ వాయిస్ బిల్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ బిల్లు లో కారు ఖరీదు రూ.16,495 రుపాయలు ఉంది. మద్రాసులోని గుప్తాస్ స్టేట్స్ హూటల్ ఒక అంబాసిడర్ కొనుగోలు చేసినట్లు ఆ ఇన్ వాయిస్ లో ఉంది. అయితే ఇప్పటికీ కొంతమంది ఈ కార్లపై మోజు తీరని వారు రిపేర్ చేయించుకొని మరీ వాడుతున్నారు.

Show comments