Bigg Boss 7 Telugu Runner Amardeep: చేజేతులా టైటిల్ పోగొట్టుకున్నా అమర్‌దీప్.. ఆ ఒక్క తప్పుతో రన్నరప్ గా

Bigg Boss 7 Telugu Amardeep: చేజేతులా టైటిల్ పోగొట్టుకున్నా అమర్‌దీప్.. ఆ ఒక్క తప్పుతో రన్నరప్ గా

బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్గా నిలుస్తాడని భావించిన అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అయితే అతడు చేసిన ఓ తప్పు వల్లే.. విన్నర్ గా మిగలాల్సిన వాడు.. రన్నర్ గా నిలిచాడు. ఇంతకు అమర్ చేసిన ఆ తప్పు ఏంటంటే..

బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్గా నిలుస్తాడని భావించిన అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అయితే అతడు చేసిన ఓ తప్పు వల్లే.. విన్నర్ గా మిగలాల్సిన వాడు.. రన్నర్ గా నిలిచాడు. ఇంతకు అమర్ చేసిన ఆ తప్పు ఏంటంటే..

ఉల్లా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 7 తాజాగా ముగిసింది. ఆదివారం అనగా డిసెంబర్ 17న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. గ్రాండ్ గా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే టైటిల్ పోరులో అమర్‌దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి.. కప్పు కొట్టగా అమర్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్‌ని ప్రకటించిన తర్వాత నాగార్జున ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పారు. అమర్, ప్రశాంత్ ఇద్దరి మధ్య చాలా క్లోజ్ ఫైట్ జరిగింది.. చాలా తక్కువ తేడా ఉంది అని తెలిపారు. ఆ తర్వాత తనకి మద్దతిచ్చిన అభిమానులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు అమర్.

“నాకు సపోర్ట్ చేసిన అక్కలు, చెల్లెళ్లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను పుట్టిన ఊరు.. నా స్వర్గం.. అనంతపురానికి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడి వరకూ వస్తానని అసలు ఊహించలేదు. కానీ వచ్చాను. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు.. పర్లేదు.” అంటూ చెప్పుకొచ్చాడు అమర్. ఇక తర్వాత తన భార్య తేజు, తల్లిని స్టేజ్ మీదకి పిలిచాడు అమర్. తన భర్త ఓటమిని చూసి తేజు భావోద్వేగానికి గురయ్యింది. అమర్‌ ని హత్తుకుని.. కన్నీళ్లు పెట్టుకుంది. మంచి కొడుకును కన్నారంటూ అమర్ తల్లిని నాగార్జున ప్రశంసించారు. ఇది ఎండ్ కాదు.. అమర్ చాలా గొప్ప స్థాయికి వెళ్తాడంటూ నాగ్.. అమర్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆ తప్పు వల్లే విన్నర్ కావాల్సినవాడు రన్నర్ గా..

ఈ సీజన్ ప్రారంభం నుంచి అమర్ దీప్ టైటిల్ విన్నర్ అని అందరూ ఊహించారు. అయితే హౌజ్ లోకి వెళ్లిన కొన్నాళ్ల పాటు అమర్ తన ఆట తాను ఆడలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాతే అమర్ ఆట తీరులో కాస్త మార్పు వచ్చింది. అయితే ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత అమర్‌దీప్‌ టైటిల్ గెలవడం పక్కా అంటూ చాలా మంది ఊహించారు. ఎందుకంటే 11, 12, 13 వారాల్లో అమర్‌దీప్ ఆటకి తగ్గట్లే అన్నీ పాజిటివ్ ఎపిసోడ్లు నడిచాయి.

దాంతో ఈ సీజన్ విన్నర్ అమర్ దీప్ అని అందరూ భావించారు. కానీ సరిగ్గా 14వ వారంలో అమర్ తన చేజేతులారా.. పెంట పెంట చేసుకున్నాడు. ఫన్ టాస్కును సీరియస్‌గా తీసుకొని ప్రశాంత్‌పై నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఫిజికల్ అయిపోయి ప్రశాంత్ ని నెట్టడం, కొరకడం, తోసేయడం చేసి.. స్వయంగా నెగిటివిటీని మూట్టగట్టుకున్నాడు.

అసలు ఆ ఎపిసోడ్‌లో అమర్ ప్రవర్తన చూసి తన అభిమానులే చిరాకుపడ్డారు. అది కాస్త ప్రశాంత్ కు కలిసి వచ్చింది. ఈ ఎపిసోడ్ని ప్రశాంత్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆ సింపథీ వేవ్ కొట్టిన దెబ్బతో టైటిల్ విన్నర్ కావాల్సిన అమర్ కాస్తా రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రైతు బిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అంటే తానే స్వయంగా ప్రశాంత్ ని విన్నర్ చేశాడు అమర్.

అమర్ నేపథ్యం ఇది..

ఇక అమర్ దీప్ విషయానికి వస్తే.. బుల్లితెర మీద అనేక సీరియల్స్ లో హీరోగా చేశాడు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టేముందు ‘జానకి కలగనలేదు’ సీరియల్‌ హీరోగా నటించాడు అమర్. ఇందులో రామాగా తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇక అంతకు ముందు ‘సిరి సిరి మువ్వలు’, ‘ఉయ్యాల జంపాల’ సీరియల్స్‌లో  నటించాడు. అనంతపురానికి చెందిన అమర్ దీప్.. బీటెక్ పూర్తి చేశాడు.

ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీవైపు వచ్చాడు. అనేక ఇబ్బందుల తర్వాత సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకున్నాడు. ముందుగా సిరి సిరి మువ్వ సీరియల్లో యాక్ట్ చేశాడు. జానకి కలగనలేదు సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్‌కి వచ్చేముందు ‘నీతోనే డాన్స్’ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. తన భార్యతో కలిసి ఈషోలో పార్టిసిసేట్ చేశాడు అమర్.

Show comments