Venkateswarlu
Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ను వరల్డ్ టూరిజం మ్యాప్‌లో ఉంచే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వరల్డ్ టూరిజం మ్యాప్‌లో ఆంధ్రరాష్ట్రాన్ని నిలపాలి. ఇందుకోసం ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ప్రసిద్ధిగాంచిన మరిన్ని ఇంటర్నేషనల్ హోటల్స్ రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నాము. ఒబేరాయ్ హోటల్స్ మొదలుకుని.. ఈ రోజు ప్రారంభమైన హయత్ ప్లేస్ వరకు మొత్తం 11 పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో వారి బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఇంకా నలుగురికి స్ఫూర్తిని ఇవ్వాలి. అనేక మంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపేవారందరికీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం ’’ అని అన్నారు.
హోటల్ చైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, చైర్మన్ వీరస్వామి తనయుడు కార్తీక్ తదితరులకు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కాగా, హయత్ ప్లేస్ అమెరికాకు చెందిన ప్రముఖ హోటల్ కంపెనీ. దీనికి ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాల్లో.. 1300లకు పైగా హయత్ ప్లేస్ హోటళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ హయత్ ప్లేస్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు విజయవాడలో కొత్త బ్రాంచీ ఓపెన్ అయింది. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ బ్రాంచ్‌ను ప్రారంభించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.