Weather Forecast Sept 23: రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం..నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం..నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం..నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తోన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిస్తాయి. గత రాత్రి కూడా ఏపీలోని కొన్ని జిల్లాలో భారీ వానలు కురిశాయి. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావ కారణంగా ఈ వానలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి మోస్తరు, తేలికపాటి వానలు కురుస్తాయని  అమరావతి వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇవాళ కోస్తాతో పాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు ఐఏండీ కీలక సూచనలు చేసింది.

గత మూడు రోజులగా ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతమైంది. అలాగే ఈ అల్పపీడనానికి నైరుతి బుతుపవనాలు తోడయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో  ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం కారణంగానే ఇవాళ కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బాపట్ల,  ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావం, నైరుతి రుతుపవనాల కారణంగా ఈ నెలలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ  వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం  ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Show comments