Rain Alert: రెండు రోజుల పాటు భారీ వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్!

రెండు రోజుల పాటు భారీ వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. గతకొన్ని రోజులుగా సెలైంట్ గా ఉన్న వానలు మరోసారి పలకరించనున్నాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వచ్చిన వానతో నగర వాసులు భయాందోళనకు గురయ్యారు. అలానే ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటిన కురింసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కీలక సమాచారం ఇచ్చింది. రాగల రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఛత్తీస్ గడ్ వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేస్తోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులో ఏపీలో వర్షాలు పడనున్నాయి. అలానే ఈ అల్పపీడనం ప్రభావం కారణం ఉపరితల ద్రోణి ఏర్పడి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇక మరోవైపు నైరుతి బుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు  ఆలస్యంగా కొనసాగనున్నాయి. ఈ నెలలో సాధారణంలేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈనేపథ్యంలో నేడు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు దాదాపు రాష్ట్రమంతటా మబ్బుగా ఉండి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, కరీంనగర్,ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, సిద్ధిపేట, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. మరో 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్  జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. రేపు ఉదయం కూడా  ఉరుములుు, మెరుపులతో కూడి వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Show comments