తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ : ఐఎండీ

Rain Alert for Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు పడే సూచన ఉందని ఐఎండీ తెలిపింది.

Rain Alert for Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు పడే సూచన ఉందని ఐఎండీ తెలిపింది.

గత వారం క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. ఉపరితల ఆవర్తనం ఒకటి మరాట్వాడా, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉందని హైదరాబాద్ వాతావారణం కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో కూడా పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెలిక పాటి వర్షాలు పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు తెలిపారు. నేడు, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాష్ట్రంల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసాయి. తెలంగాణలో కుమురం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, బి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో నేడు.. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపారు. అంతే కాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. నిన్న రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 0.5 నుంచి 31.8 మిల్లీ మీటర్ల వరకు వర్షాలు కురిశాయని.. అత్యధికంగా నల్లగొండ జిల్లా 31.8 మిల్లీమీటర్లు నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 16.8, రంగారెడ్డి 15.7, నారాయణ పేటలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంది.. సాయంత్రం వేళ్ చిరు జల్లు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంటున్నారు.

మరోవైపు ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో మాత్రం పగటి పూట ఎండలు.. రాత్రి వేళ మంచు ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు అంటున్నారు. మొన్నటి వరకు ఎర్రటి ఎండటతో ప్రజలు సతమతమవుతున్నారు.. వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Show comments