Nara Chandrababu: బాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారులు ట్విస్ట్!

బాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారులు ట్విస్ట్!

మాజీ సీఎం చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు మరో కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే బాబు పేరుతో  ఓ  లేఖను బయటకు వదిలారు. అయితే చంద్రబాబు లేఖపై రాజమండ్రి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు మరో కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే బాబు పేరుతో  ఓ  లేఖను బయటకు వదిలారు. అయితే చంద్రబాబు లేఖపై రాజమండ్రి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ ఎన్నికల గురించి ప్రజల మధ్యకు వెళ్తుంటే..టీడీపీ మాత్రం స్కిల్ స్కాం కుంభకోణంలో అరెస్టైన నారా చంద్రబాబు నాయుడి కోసం ప్రజల్లోకి వెళ్తుందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న వార్త. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు మరో కార్యక్రమానికి టీడీపీ నాయకులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బాబు పేరుతో  ఓ  లేఖను బయటకు వదిలారు. అయితే చంద్రబాబు లేఖపై రాజమండ్రి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమం చేయనున్నారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పేరుతో ఓ లేఖ బయటకు వచ్చింది. అందులో పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. తాను జైల్లో లేననని, ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం ఆ లేఖ విడుదల చేశారు.

దీంతో ఈ లేఖ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు లేఖపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ జైలు నుంచి రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని వెల్లడించారు. ఏ ముద్దాయి అయినా జైలు నుంచి తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా తమకు తెలియజేయాలని అధికారులు పేర్కొన్నారు.  ఆ తరువాత జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా  అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారు.

ఇలా చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారని చెప్తున్న లేఖపై విచారణ జరుపుతున్నామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని అన్నారు. మరి..చంద్రబాబు లేఖ అంశంలో పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments