తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ ముఖ్య అలర్ట్‌!

జూలై నెల చివరి నుంచి ఆగస్ట్‌ ప్రారంభం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా జనాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదర్కొన్నారు. వారం రోజుల పాటు ఎండ అనేది లేకుండా.. ఎడతెరిపి లేని వానలు కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత 10 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడే లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోతతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణశాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. నేటి నుంచి రానున్న మూడ్రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాతారణ శాఖ తెలిపిన దాని ప్రకారం.. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను తనవైపు తిప్పుకుంటుంది. ఈ మేఘాలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలపై ఆవరించి ఉన్నాయని.. ఈకారణంగా నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అచనా వేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి- భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారుల. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం..

ఇక ఈ ఆవర్తన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు సూచించారు. రాయలసీమపై దీని ప్రభావం లేనందున అక్కడ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. అయితే చెన్నైకి దగ్గర్లో బంగాళాఖాతంలో చిన్న ఆవర్తనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రాయలసీమలోనూ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Show comments