తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక అప్డేట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

IMD Weather Updates: ఈ ఏడాది ఎండలు ఎలా మండిపోయాయో.. అలాగే వర్షాలు కూడా అలాగే దంచికొడుతున్నాయి. జులై నెల నుంచి మొదలైన వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

IMD Weather Updates: ఈ ఏడాది ఎండలు ఎలా మండిపోయాయో.. అలాగే వర్షాలు కూడా అలాగే దంచికొడుతున్నాయి. జులై నెల నుంచి మొదలైన వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

దేశంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి.మహరాష్ట్ర, కేరళా, అస్సాం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దక్షిణాది అరేబియా సముద్రం దగ్గర ద్రోణి కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి ఉంది. దీని ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రుతుపవనాలు చురుగ్గా సాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపి, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక అప్ డేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్. రెండు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజలు పాటు పలు జిల్లాల్లో తెలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ములుగు, భూపాల్ పల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడె జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్ల అలర్ట్ జారీ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. నేటి నుంచి నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Show comments