Arjun Suravaram
Pawan kalyan: బుధవారం తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ, జనసేన కూటమి సభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారనే పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.
Pawan kalyan: బుధవారం తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ, జనసేన కూటమి సభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారనే పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.
Arjun Suravaram
బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో టీడీపీ, జనసేన పార్టీల కూటమి సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఇరు పార్టీల అధినేతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ కే అనుకూలంగా మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జెండా సభలో పవన్ ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
తాడేపల్లిలో జరిగిన టీడీపీ,జనసేన జెండా అనే భారీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనం రాలేదు. ఇరు పార్టీలు కలిసి నిర్వహించిన కూడా సిద్ధం సభలో ఒక వైపు వచ్చిన అంతమంది జనం మాత్రమే ఈ సభలో కనిపించారు. తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్..తన నాలుగో పెళ్లం జగనే అంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రసంగించారు. తాను వీరుడని, సూరుడని, దేవదత్తుడినని, వామనుడినని భారీ సినిమా డైలాగ్స్ చెబుతూ ఊగిపోయాడు. అయితే పవన్ ప్రసంగం చూసిన బాబు తల పట్టుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రసంగంతో కూటమికి మైలేజ్ తెచ్చేది పోయి…జగన్ కి అనుకూలం అయ్యేలా చేశాడని బాబు సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.
ఒక స్థాయిలో జగన్ పై ఆరోపణలు చేస్తే బాగుండేదని, కానీ పవన్ కల్యాణ్ శృతిమించి వ్యాఖ్యలు చేశారని, అవి తమకే ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు భావించారట. రాజకీయాల్లో సీనియార్టీ లేకుండా ఇలా పక్కన పెట్టుకుంటే.. భారీ మూల్యం తప్పదనే భావనకు చంద్రబాబు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సభ అనంతరం పవన్ ప్రసంగంపై కూడా టీడీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. ఇలా పవన్ చేసే ప్రసంగాలు, స్పీచ్ ల కారణంగా కూటమికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. సీఎం జగన్ ను ఎంత దారుణంగా తిడితే.. అంత ప్రజల్లో ఆయనకు ప్లస్ అవుతుందని, పవన్ చేసిన ప్రసంగం అలాంటి ఫలితాలనే ఇస్తుందని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. సభ అనంతరం పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అసంతృప్తులను చల్లార్చలేక తల పట్టుకుంటున్న బాబుకు పవన్ కళ్యాణ్ ప్రసంగం మరింత తలపోటు తెప్పించిందనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.