Big Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్! మూడు రోజులు వానలే వానలు!

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్! మూడు రోజులు వానలే వానలు!

Big Rain Alert: జులై నుంచి మొదలు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Big Rain Alert: జులై నుంచి మొదలు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్,బిహార్, మహారాష్ట్ర, కేరళా, అస్సాం, గుజరాత్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జీలు కూలిపోతున్నాయి.. జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండల మారాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలోకి వెళ్లిపోయాయి. రవాణా వ్యవస్థ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళా ఖాతంలో ఏర్పడి అల్ప పీడనం సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్, నల్లగొండ, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ‌శాఖ అధికారులు తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఎన్టీఆఱ్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్, ప్రకాశం, నంద్యాల, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఎండ వచ్చినప్పటికీ సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Show comments