విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.1.25 కోట్లు జమ!

విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.1.25 కోట్లు జమ!

పిల్లలకు మనం ఇచ్చే అతి పెద్ద ఆస్తి చదువు అని బలంగా నమ్ముతారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తే అదే వారి భవిష్యత్తుకు దారి చూపుతుంది అంటారు. అయితే నేటి కాలంలో నాణ్యమైన విద్య అనేది ఎంత ఖర్చుతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం జగన్‌.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడమే కాక.. విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంతో పాటు అమ్మ ఒడి, గోరు ముద్ద వంటి కార్యక్రమల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారు సీఎం జగన్‌. అంతేకాక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులను ప్రొత్సాహించేందుకు వారికి భారీగా ఆర్ధిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం జగనన్న విదేశీ విద్యా దీవెన పథక కింద ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ క్రమంలో నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేయానున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గురువారం జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేస్తారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి విడుల చేస్తారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100 శాతం మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తోంది ప్రభుత్వం. ఇక ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందజేస్తున్నారు. ఇక ప్రతి ఏటా 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి ఈ నిధుల్ని అందజేస్తున్నారు.

ఈ పథకంలో భాగంగా ఆయా సంబంధిత శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీల నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా.. పూర్తి పారదర్శకంగా.. లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. గత 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్ల రూపాయలు. ఇక విద్యార్థులకు అందించే మొత్తాన్ని.. వారు కోర్స్‌ పూర్తి చేసుకునేలా 4 విడతల్లో విదేశీ విద్యా దీవెన నిధలు అంద జేస్తారు.

ఈ పథకంలో భాగంగా ఇమ్మిగ్రేషన్‌ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా నిధులు అందిస్తున్నారు. అలాగే 2వ వాయిదా మొత్తాన్ని మొదటి సెమిస్టర్‌ ఫలితాల తర్వాత, 3వ వాయిదా కింద ఇచ్చే మొత్తాన్ని 2వ సెమిస్టర్‌ ఫలితాల తర్వాత అందజేస్తారు. ఇక 4వ సెమిస్టర్‌ విజయవంతంగా పూర్తి చేసి.. కోర్స​్‌కు సంబంధించిన మార్క్‌ షీట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక చివరి వాయిదా నిధులు చెల్లిస్తున్నారు.

గతంలో ఈ పథకం కింది సాయం పొందాలంటే కుబుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలకు మించకుండా ఉండాలి. కానీ జగన్‌ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 నుంచి రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతోంది. ఈ పథకం పూర్తి వివరాలను https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం ‘జగనన్నకు చెబుదాం (1902 టోల్‌ ఫ్రీ నంబర్‌)’లోనూ సంప్రదించవచ్చు.

Show comments