AP Govt-Tuvar Dal To Ration Card Holders: APలో రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌.. వచ్చే నెల నుంచి పక్కా అమలు

APలో రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌.. వచ్చే నెల నుంచి పక్కా అమలు

సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఏపీ సర్కార్‌. ఈ క్రమంలో తాజాగా రేషన్‌ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పక్కా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకు దేని గురించి అంటే..

సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఏపీ సర్కార్‌. ఈ క్రమంలో తాజాగా రేషన్‌ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పక్కా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకు దేని గురించి అంటే..

ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ.. పాలన సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలో తాజాగా ఏపీలో రేషన్‌ ఉన్న వారందరికి సీఎం జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పతింది. వచ్చే నెల నుంచి దీన్ని పక్కగా అమలు చేస్తామని తెలిపింది. ఇంతకు ఆ శుభవార్త ఏంటి అంటే..

రేషన్‌కార్డు ఉన్న వారికి.. ప్రజా పంపిణీ వ్యవస్థ కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది. నవంబర్ నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు రేషన్‌ కార్డు మీద కిలో చొప్పున కందిపప్పు అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు ఆర్డర్‌ ఇచ్చింది.

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు నడుస్తోంది. పెరిగిన ధరతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా.. తక్కువ ధరకే కంది పప్పును సరఫరా చేయనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.67కు కిలో కందిపప్పును అందివ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు లెక్క. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల దగ్గర అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనున్నారు.

నవంబర్ మాత్రమే కాదు.. డిసెంబర్, జనవరి వరకు కూడా సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు రెడీ అవుతోంది సర్కార్‌. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తామంటోంది ప్రభుత్వం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నారు అధికారులు. రైతుల నుంచి మార్కెట్‌ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్.

Show comments