Dharani
సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఏపీకి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలడం లేదు. పైగా తప్పంతా ఆమెదే అంటున్నారు టీడీపీ నేతలు. ఆ వివరాలు..
సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఏపీకి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలడం లేదు. పైగా తప్పంతా ఆమెదే అంటున్నారు టీడీపీ నేతలు. ఆ వివరాలు..
Dharani
తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గీతాంజలి మరణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. జగన్ ప్రభుత్వం తనకు ఇంటి పట్టా అందించిందనే వార్తను పంచుకుంటూ.. వైసీపీ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు వివరిస్తూ.. కృతజ్ఞతలు చెప్పింది గీతాంజలి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ప్రభుత్వం వల్ల తనకు జరిగిన మేలు చెప్పుకొచ్చింది గీతాంజలి. కానీ పచ్చ మీడియా మాత్రం ఆమె ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని.. కావాలనే ప్రభుత్వాన్ని పొగిడింది అన్నట్లుగా విమర్శలు చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక రైలు కింత పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా #JusticeForGeethanjali, #WeStandWithGeethanjali హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
వేధింపులు భరించలేక గీతాంజలి చనిపోతే.. కనీసం మానవవత్వం లేకుండా.. విమర్శలు చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే టీడీపీ నేత మహాసేన రాజేష్ గీతాంజలి మృతిపై స్పందిస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. జరిగిన దారుణంలో గీతాంజలిదే తప్పు.. ట్రోలింగ్ చేస్తే చచ్చిపోవాలా.. అంటూ పనికి మాలిన ప్రశ్నలు వేశాడు. గీతాంజలి మృతికి వైఎస్ జగనే కారణం అంటూ అర్థంపర్థంలేని ఆరోపణలు చేశాడు. గీతాంజలి నిజంగా చనిపోయే ఉంటే అంటూ పనికి మాలిన అనుమానాలు వ్యక్తం చేశాడు. వైసీపీ చెప్పింది కాబట్టి.. గీతాంజలి చనిపోయింది అనే విషయాన్ని కూడా తాను నమ్మనని చెప్పాడు. అంతేకాక సమర్థత లేని ఇలాంటి వాళ్లని ఎందుకు తెర మీదకు తీసువచ్చారు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పోయాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో.. మహాసేన రాజేష్‌పై మండి పడుతున్నారు నెటిజనులు. ట్రోలింగ్ అనేదే తప్పు.. దాన్ని నువ్వు ఇంక సమర్థించుకుంటున్నావా.. నీ కుటుంబలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే నీకు వారి బాధ అర్థం అయ్యేది.. ఆమె ఏం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు కదా.. తనకు కలిగిన మేలు గురించి చెప్పింది. అది కూడా తప్పనట్లు ట్రోలింగ్ చేసి ప్రాణాలు తీసుకునేలా చేయడమే కాక.. పైగా తప్పంతా ఆమెదే అని మాట్లాడుతున్నావు.. నీకు కాస్త కూడా మానవత్వం లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.
ట్రోలింగ్ చేస్తే చచ్చిపోవాలా ?
సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలిదే తప్పు : టీడీపీ నాయకుడు రాజేష్ మహాసేన#JusticeForGeethanjali pic.twitter.com/sD94uMzZff
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) March 11, 2024