AP And TS Weather Forecast: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

సెప్టెంబర్‌ నెల ప్రారంభం నుంచి వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. జులై నెలలో దంచి కొట్టిన వర్షాలు జనాల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. దేశ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాయి. ఆగస్టు నెలకు వచ్చే సరికి ఈ పరిస్థితి తారుమారైంది. నెల మొత్తం కలిపి కేవలం రెండు మూడు సార్లు మాత్రమే వర్షాలు పడ్డాయి. సెప్టెంబర్‌ నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు నెలలోనే వాతావరణ శాఖ అంచానా వేసింది. ఆ అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచానా వేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30-40 ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరి, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments