ఏపీ కేబినెట్ నిర్ణయాలు! మహిళల ఖాతాల్లో డబ్బులు.. నిరుద్యోగులకు తీపి కబురు!

AP Cabinet 2024: బుధవారం తాడేపల్లిలోని ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలకు ఆమోదం పడింది. ముఖ్యంగా నిరుద్యోగులకు, మహిళలకు జగన్ ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది.

AP Cabinet 2024: బుధవారం తాడేపల్లిలోని ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలకు ఆమోదం పడింది. ముఖ్యంగా నిరుద్యోగులకు, మహిళలకు జగన్ ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది.

బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతను ఈ కేబినెట్ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే పలు అంశాలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

బుధవారం తాడేపల్లిలో జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం పడింది. ఇక ఇదే సమయంలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ స్టాప్, పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయుత నాలుగో విడత నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 16 నుంచి వైఎస్సార్ చేయుత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది.

అలానే  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉండాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం,ఏఐపీబీ ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులకు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్ట్ వంటి వాటికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Show comments