iDreamPost

టీమిండియా వద్దన్నోళ్లే ఛాంపియన్స్ అయ్యారు.. ఇంత టాలెంట్​ను ఎలా వదులుకున్నారు!

  • Published May 27, 2024 | 4:53 PMUpdated May 27, 2024 | 4:53 PM

ఐపీఎల్-2024 విజేతగా ఆవిర్భవించింది కోల్​కతా నైట్ రైడర్స్. టీమిండియా వద్దనుకున్న పలు ప్లేయర్లు ఛాంపియన్స్ అయ్యారు. దీంతో ఇంత మంచి టాలెంట్​ను ఎలా వదులుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐపీఎల్-2024 విజేతగా ఆవిర్భవించింది కోల్​కతా నైట్ రైడర్స్. టీమిండియా వద్దనుకున్న పలు ప్లేయర్లు ఛాంపియన్స్ అయ్యారు. దీంతో ఇంత మంచి టాలెంట్​ను ఎలా వదులుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published May 27, 2024 | 4:53 PMUpdated May 27, 2024 | 4:53 PM
టీమిండియా వద్దన్నోళ్లే ఛాంపియన్స్ అయ్యారు.. ఇంత టాలెంట్​ను ఎలా వదులుకున్నారు!

కోల్​కతా నైట్ రైడర్స్ నయా ఛాంపియన్​గా అవతరించింది. పదేళ్ల తర్వాత ఐపీఎల్ కప్పును ఒడిసిపట్టిందా జట్టు. ఈ సీజన్ మొత్తం తిరుగులేని ఆటతీరుతో అందర్నీ వణికిస్తూ వచ్చిన అయ్యర్ సేన.. సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లోనూ అదే ఊపును కంటిన్యూ చేసింది. గ్రూప్ స్టేజ్, ప్లేఆఫ్స్ మ్యాచుల కంటే తుదిపోరు మరింత ఉత్కంభరితంగా సాగుతుందనుకుంటే కేకేఆర్ చెలరేగి ఆడి వార్ వన్ సైడ్ చేసేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ఎస్​ఆర్​హెచ్ 113 పరుగులకు కుప్పకూలింది. ఈజీ టార్గెట్​ను ఇంకో 57 బంతులు ఉండగానే ఉఫ్​మని ఊదిపారేసింది కోల్​కతా. పదేళ్ల తర్వాత కప్పు కలను నిజం చేసుకుంది. ఓవరాల్​గా ఆ టీమ్​కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.

కోల్​కతా కప్పు గెలవడంలో ఇంటర్నేషనల్ స్టార్లు అయిన ఫిల్ సాల్ట్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, రెహ్మానుల్లా గుర్బాజ్ కీలక పాత్ర పోషించారు. వీళ్లతో పాటు హర్షిత్ రాణా, అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్​దీప్ సింగ్, వైభవ్ అరోరా లాంటి డొమెస్టిక్ ప్లేయర్లు కూడా సత్తా చాటారు. భారత క్రికెట్ వద్దనుకున్న వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ సిసలైన గేమ్​ను బయటకు తీసి తమ దమ్ము చూపించారు. కేకేఆర్ విజయాల్లో మెయిర్ రోల్ పోషిస్తూ ఛాంపియన్స్​గా నిలిచారు. ఈ నలుగురు కూడా ఒక టైమ్​లో టీమిండియాలో చాలా కీలకంగా వ్యవహరించిన వారే. భారత్ తరఫున 9 మ్యాచులు ఆడిన వెంకీ అయ్యర్ 133 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు.

టీ20 టీమ్​లో సెటిల్ అవుతున్న టైమ్​లో వెంకీ అయ్యర్​ను అర్ధంతరంగా తీసేశారు. మరో కేకేఆర్ స్టార్ వరుణ్ చక్రవర్తిది వేరే స్టోరీ. ఐపీఎల్​లో అదరగొట్టి టీ20 ప్రపంచ కప్-2021 జట్టులో చోటు దక్కించుకున్నాడీ స్పిన్నర్. మెగా టోర్నీ నుంచి భారత్ ఒట్టి చేతులతో వచ్చింది. అయితే చాలా మంది స్టార్లు ఫెయిలైనా జట్టు ఓటమికి వరుణ్​ను బలిపశువును చేశారు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడతను. కొన్ని నెలల కింద వరకు భారత జట్టులో మూడు ఫార్మాట్లలోనూ కీలకంగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు టీమ్​లో లేడు. డొమెస్టిక్ క్రికెట్​లో ఆడలేదనే కారణంతో అతడి కాంట్రాక్ట్​ను బీసీసీఐ రద్దు చేసింది. ఇక, టీ20 టీమ్​ విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రింకూను ఐపీఎల్​లో అంతగా రాణించలేదనే కారణంతో టీ20 వరల్డ్ కప్​కు సెలెక్ట్ చేయలేదు. భారత క్రికెట్ బోర్డు వద్దనుకున్న ఈ ప్లేయర్లు అందరూ కసిగా ఆడి కేకేఆర్​ను ఛాంపియన్​ను చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి