OTT Suggestions- Best Romantic Movies: OTTలో బెస్ట్ అడ్వెంచరస్ లవ్ స్టోరీ! కొన్ని ఆ సీన్స్ ఉంటాయి జాగ్రత్త!

OTTలో బెస్ట్ అడ్వెంచరస్ లవ్ స్టోరీ! కొన్ని ఆ సీన్స్ ఉంటాయి జాగ్రత్త!

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ సినిమాలను వదలకుండా చూసేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి లవ్ స్టోరీ చూశారా? చూడకపోతే మాత్రం మీకోసమే ఈ మూవీ సజీషన్.

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ సినిమాలను వదలకుండా చూసేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి లవ్ స్టోరీ చూశారా? చూడకపోతే మాత్రం మీకోసమే ఈ మూవీ సజీషన్.

ఓటీటీలో బోలెడు లవ్ స్టోరీస్ మీరు చూసుంటారు. ఒక టైటానిక్ దగ్గరి నుంచి డీజే టిల్లు దాకా అన్ని రకాల ప్రేమ కథలు, స్టోరీలను మీరు చూసే ఉంటారు. కానీ, ఇది మాత్రం చాలా స్పెషల్ లవ్ స్టోరీ. కల్మషం లేని ప్రేమకు ఇది ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు. వారి మధ్య ఉన్నది ప్రేమ అనే విషయం కూడా వారికి తెలియకుండా పెరిగి పెద్ద అవుతారు. ఆ తర్వాత శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా వారి మధ్య ఉన్న బంధం ఏంటో వారికి ఒక క్లారిటీ వస్తుంది. ఈ మూవీని పిల్లలతో మాత్రం చూడకండి. కానీ భార్యాభర్తలు కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయదగిన ఒక మంచి లవ్ స్టోరీ. మరి.. ఆ మూవీ ఏది? దాని కథ ఏంటో చూద్దాం.

ప్రేమ పలు రకాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇండస్ట్రీలో వచ్చే ప్రేమ కథలు కూడా పలు రకాలుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ భిన్నమైన ప్రేమకథా చిత్రం కూడా ఉంటుంది. ఈ మూవీ హాలీవుడ్ వాళ్లు నిర్మించారు. అది కూడా 44 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. ఆ రోజుల్లోనే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండా ఒక దీవిలో ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని మీరు యూట్యూబ్ లో చూడాలి అంటే మాత్రం అయితే రెంటుకు తీసుకోవాలి.. లేదంటే యూట్యూబ్ లో కొనుక్కోవాలి. అంత హై డిమాండ్ ఉన్న చిత్రం ఇది.

ఈ మూవీ పేరు ‘ది బ్లూ లగూన్’. ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్ తెరకెక్కించింది. ఈ మూవీని 1980ల్లోనే 4.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి తీశారు. ఇది అప్పట్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 59 మిలియన్ డాలర్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. అప్పట్లోనే ఈ చిత్రం ఒక సంచలనంగా మారింది. ఈ బ్లూ లగూన్ చిత్రం కథ విషయానికి వస్తే.. ఒక అబ్బాయి, అమ్మాయి వాళ్ల కుటుంబంతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్లు ప్రయాణిస్తున్న నౌకలో ప్రమాదం జరుగుతుంది. అందరూ లైఫ్ బోట్స్ ద్వారా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ చిన్న పడవ ఒక దీవికి చేరుకుంటుంది. కానీ, ఆ పడవలో ఉన్న అమ్మాయి, అబ్బాయి మాత్రమే బతుకుతారు.

అమ్మాయి- అబ్బాయి చిన్నప్పటి నుంచి ఆ దీవిలోనే ఒకరికి ఒకరు తోడుగా బతుకుతారు. చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. వాళ్లిద్దరు పెరిగి పెద్దవుతారు. ఆ అబ్బాయి ఒక అందమైన యువకుడిగా.. ఆ అమ్మాయి అందమైన యువతిగా మారతారు. వారికి ప్రేమకు అర్థం తెలియకపోయినా.. వారి శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా వాళ్లు శారీ*రకంగా ఒకటవుతారు. వారి కోరికలు తీర్చుకుంటారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే వారి జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అసలు వారి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? వారి ప్రేమ ఎలా సాగింది? అనేదే ది బ్లూ లగూన్ సినిమా.

Show comments