ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. చిల్ అవుతున్న సమంత.. ఫొటోలు వైరల్

ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. చిల్ అవుతున్న సమంత.. ఫొటోలు వైరల్

Samantha Latest Pics: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Samantha Latest Pics: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్.. ఇటీవలే తన ఫిట్ నెస్ ఫ్రీక్ ను చూపించింది. బీఎంఆర్(బేసల్ మెటబాలిక్ రేట్) రిపోర్ట్ ను పంచుకుంది. అందులో ఆమె మెటాబాలిక్ ఏజ్ 23 గాను, బరువు 50 కిలోలుగానూ ఉంది. ప్రస్తుతం చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

సమంత సినిమాలకు గ్యాపిచ్చి.. తన ఆరోగ్యంపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మయోసైటిస్ వ్యాధికి గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ వస్తోంది. గడ్డకట్టే చలిలో వ్యాయామాలు చేస్తూ.. దృఢంగా మారుతోంది. ప్రస్తుతం మలేషియా వెకేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది సామ్. కొబ్బరి నీళ్లలాంటి చల్లటి, తెల్లటి నీళ్లలో టూ పీస్ డ్రెస్ లో జలకాలాడుతూ.. దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. చికిత్సలో భాగంగానే సామ్ మలేసియా వెళ్లిందా? లేక వెకేషన్ కోసమే వెళ్లిందా? తెలీయడం లేదు.

ప్రస్తుతం సమంత పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదని కొందరు కామెంట్ చేయగా.. త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని మరికొందరు కోరుకుంటున్నారు. కాగా ఇటీవలే బీఎంఆర్(బేసల్ మెటబాలిక్ రేట్) రిపోర్ట్ ను పంచుకుంది. అందులో ఆమె మెటాబాలిక్ ఏజ్ 23 గాను, బరువు 50 కిలోలుగానూ ఉంది. తన ఫొటోలకు హైట్స్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ బ్యూటీ సినిమాలకు మరికొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి సామ్ లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మహేష్ క్రేజ్.. 5 సెకన్ల వాయిస్ కు.. 5 కోట్ల రెమ్యునరేషన్!

Show comments