IT ఉద్యోగులకు షాక్.. 80వేల మంది ఉద్యోగాలు ఊడినయ్..

IT ఉద్యోగులకు షాక్.. 80వేల మంది ఉద్యోగాలు ఊడినయ్..

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగానికి గ్రహణం పట్టింది. వేలది మంది ఉద్యోగాలు ఊడుతున్నాయ్. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ప్రతి క్షణం టెన్షన్ తో గడుపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 80 వేల మంది ఉద్యోగాలు ఊడినయ్.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగానికి గ్రహణం పట్టింది. వేలది మంది ఉద్యోగాలు ఊడుతున్నాయ్. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ప్రతి క్షణం టెన్షన్ తో గడుపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 80 వేల మంది ఉద్యోగాలు ఊడినయ్.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఒకటే కలవరం మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని. వరల్డ్ వైడ్ గా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. లేఆఫ్స్ మూలంగా వేలది మంది ఐటీ ఉద్యోగాలు పోతున్నాయ్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఆర్థికమాంద్యం హెచ్చరికలతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ లేఆఫ్స్‌కు తెరలేపాయి. గతేడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంది. ఎన్నో కలలతో ఐటీ రంగంలో అడుగుపెట్టిన వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. అసలు ఉన్నట్టుండి ఉద్యోగం పోతే బ్రతికేది ఎలా? కుటుంబాన్ని పోషించేది ఎలా? అంటూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు ఐటీ ఉద్యోగులు.

ప్రస్తుత కాలంలో ఐటీ జాబ్ లకు ఉండే క్రేజ్ వేరు. కళ్లు చెదిరే ప్యాకేజీలు, వారాంతపు సెలవులు, ఆహ్లాదకరమైన వాతావరణం, వీకెండ్ పార్టీలు ఇన్ని వెసులుబాట్లు సాఫ్ట్ వేర్ రంగానికి ఫుల్ డిమాండ్ తెచ్చిపెట్టాయి. అయితే ఒకప్పుడు ఐటీరంగం బాగానే ఉన్నా నేటి రోజుల్లో పరిస్థితి దారుణంగా మారింది. టెక్ కంపెనీల్లో కొత్తగా రిక్రూట్ మెంట్లు లేకపోగా ఉన్న ఉద్యోగులను సైతం తీసేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, అమెజాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2022, 2023లో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

2024 మొదటి నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 279 సంస్థల్లో 80,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎలోన్ మస్క్ మొత్తం టెస్లా ఛార్జింగ్ టీమ్‌నే రద్దు చేశాడు. టెస్లా తన ప్రపంచ శ్రామిక శక్తి నుండి 10 శాతం (లేదా 14,000 మంది) తగ్గించిన వారాల తర్వాత వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ కూడా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా కూడా 10శాతం మంది ఉద్యోగులను తొలగించింది.

Btech చేస్తున్నారా?

ఇదిలా ఉంటే ప్రస్తుతం బీటెక్ చేస్తున్న వారు లేదా ఇది వరకే పూర్తి చేసిన వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వేలాది మంది నిరుద్యోగులు ఐటీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి బీటెక్ పట్టాభద్రులు ఇతర రంగాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా బీటెక్ లో చేరే వారు ఇతర కోర్సుల గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు.

Show comments