Rajinikanth, Governor Post: రజినీకాంత్ కు గవర్నర్ పదవి? ఆయన సోదరుడు ఏమన్నాడంటే?

రజినీకాంత్ కు గవర్నర్ పదవి? ఆయన సోదరుడు ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 11:35 AM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 11:35 AM, Mon - 4 September 23
రజినీకాంత్ కు గవర్నర్ పదవి? ఆయన సోదరుడు ఏమన్నాడంటే?

‘జైలర్’ మూవీ సూపర్ సక్సెస్ తో రజినీకాంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన తలైవా.. 700 కోట్లకు పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు భారీ లాభాలు రావడంతో.. జైలర్ నిర్మాత రజినీకాంత్ కు, డైరెక్టర్ కు కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. కగా.. ప్రస్తుతం తలైవాకు సంబంధించిన ఓ న్యూస్ సౌత్ ఇండస్ట్రీతో పాటుగా పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? త్వరలోనే రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారన్న న్యూస్. ఈ వార్తపై తాజాగా రజినీ సోదరుడు స్పందించారు.

గత కొన్ని రోజులుగా సౌత్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ ఏదైనా ఉందంటే? అది రజినీకాంత్ కు సంబంధించినదే. అవును రజినీకాంత్ త్వరలో గవర్నర్ కాబోతున్నారు అంటూ తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ తాజాగా స్పందించాడు. ఆదివారం నాడు మధురైనలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రజినీకాంత్ కు గవర్నర్ పదవి రావడం ఆ భగవంతుడి చేతుల్లో ఉందని సత్యనారాయణ తెలిపారు. రజినీ గవర్నర్ పదవిపై ఎలాంటి ఆశ పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు సత్యనారాయణ.

అయితే రజినీకి గవర్నర్ అంశంపై మరోసారి తెరపైకి రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. గత కొంతకాలంగా రజినీకాంత్ రాజకీయ ప్రముఖులను కలుస్తుండటంతో.. ఈ వార్తకు మరింతగా ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఉత్తర భారతదేశంలో పర్యటించిన రజినీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో భేటీ కావడం. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ కావడంతో కూడా ఈ వార్తకు బలం చేకూర్చాయి. మరి ఈ వార్తలపై రజినీ ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాలి.

Show comments