Pic Talk: ఈ ఫోటోలోని పాప ఓ స్టార్ హీరోయిన్.. తన నవ్వితే చాలు.. కుర్రాళ్లు ఫ్లాట్

ఈ ఫోటోలోని పాప ఓ స్టార్ హీరోయిన్.. తన నవ్వితే చాలు.. కుర్రాళ్లు ఫ్లాట్

ఈ ఫోటోలో పళ్లన్నీ బయటకు పెట్టి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్ . అంతేకాదు నిర్మాత కూడా. బిజినెస్ ఉమెన్ ఆల్సో. ఇంతకు ఆ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో పళ్లన్నీ బయటకు పెట్టి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్ . అంతేకాదు నిర్మాత కూడా. బిజినెస్ ఉమెన్ ఆల్సో. ఇంతకు ఆ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ పేరు మార్మోగేలా చేశాయి. దీంతో బాలీవుడ్ హీరోస్ కూడా ఇక్కడ విలన్స్ రోల్స్ కోసం సై అంటున్నారు. అలాగే బాలీవుడ్ ఈ తరం ముద్దుగుమ్మలు సైతం ఇక్కడి హీరోలతో ఆడిపాడేందుకు, టీటౌన్ దర్శకులతో పనిచేసేందుకు ఊవిళ్లూరుతున్నారు. ఒక్క సినిమా అయినా లేదా స్పెషల్ రోల్ , స్పెషల్ సాంగ్ అయినా ఓకే అంటున్నారు. ఇప్పుడు ఇక్కడకు వస్తున్న హిందీ హీరోయిన్ల జాబితా పెరిగింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలీవుడ్ హీరోయిన్లు కొత్త కాదు. ఎప్పటి నుండో దర్శక నిర్మాతలు వారికి రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉన్నారు. కెరీర్ స్టార్ చేసిన కొత్తలో తెలుగు సినిమాల్లో మెరిసి.. ఆ తర్వాత తిరిగి బీటౌన్‌లో సత్తా చాటుతున్నారు.

ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ చెట్టుకొమ్మే. చిన్న బొట్టు పెట్టుకుని, చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప.. ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసినా.. తన అందమైన మోముతో ఆకట్టుకుంది. బాలీవుడ్ బాట పట్టి.. వరుస హిట్టు అందుకుని కుర్రాళ్లను పిచ్చెక్కింది. ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూర్‌గా మారి.. హవా సాగిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. మణితర్నం దిల్ సే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెంకటేష్ మూవీ ప్రేమంటే ఇదేరాలో నటించింది. తన సొట్టబుగ్గలతో మాయలో పడేసింది. దీంతో రాఘవేంద్రరావు.. మహేష్ బాబును హీరోగా ఇంటర్ డ్యూస్ చేస్తూ.. తెరకెక్కించిన రాజకుమారుడు చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఈ రెండు సక్సెస్ సాధించగా.. అనంతరం బాలీవుడ్ బాట పట్టింది.

తెలుగులో ఇక సినిమాలు చేయలేదు. కానీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. సంఘర్షణ్, మిషన్ కాశ్మీర్, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్ చాహతాహై, అర్మాన్, కల్ హో నహో, వీర్ జరా, సలామ్ నమస్తే, క్రిష్ (స్పెషల్ క్యామియో) ఆమెను స్టార్ హీరోయిన్ చేసేశాయి. అప్పట్లో బడా హీరోయిన్లకు కాంపీటేషన్ అయ్యింది. 2007లో వచ్చిన జూమ్ బరార్ జూమ్ తర్వాత.. ఆమె ఎక్కువగా స్సెషల్ అపీయరెన్స్, స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది. నిర్మాతగా మారి.. పలు సినిమాలను తెరకెక్కించింది. ఇష్క్ ఇన్ పారీస్, ద నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్‌ను నిర్మించింది. 2008లో ఐపీఎల్ ఫ్రాంచేజీని కొనుగోలు చేసింది. కింగ్స్ XI పంజాబ్ అని పేరు పెట్టింది (దీనిని 2021లో పంజాబ్ కింగ్స్‌గా మార్చారు) ఓనర్ అయ్యింది. IPL జట్టును కలిగి ఉన్న ఏకైక మహిళగా మారింది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయితే చాలు.. గ్యాలరీలో కూర్చుని జట్టును ఉత్సాహ పరుస్తూ.. కనిపిస్తూ ఉంటుంది.

Show comments