MLC Kavitha, Smriti Irani On Menstruation: మహిళలకి నెలసరి సెలవులపై వివాదం.. కేంద్ర మంత్రిపై కవిత విమర్శలు!

MLC Kavitha: మహిళలకి నెలసరి సెలవులపై వివాదం.. కేంద్ర మంత్రిపై కవిత విమర్శలు!

నెలసరి సమస్య గురించి కేంద్రమంత్రి స్మతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

నెలసరి సమస్య గురించి కేంద్రమంత్రి స్మతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

నేటికి కూడా మన సమాజంలో రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లడరు. చాలా మంది విద్యార్థినులు నెలసరి సమస్య కారణంగా పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు. ఆ సమయంలో తీసుకునే జాగ్రత్తల గురించి కూడా చాలామందికి సరైన అవగాహన లేదు. ఈక్రమంలో ఉద్యోగం చేసే మహిళలకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రుతుస్రావం అంశం మీద ప్రస్తుతం దేశవ్యా‍ప్తంగా చర్చ సాగుతోంది. నెలసరి సెలవుల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాక వివాదావస్పదంగా కూడా మారాయి.

స్మృత ఇరానీ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.  స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కవిత చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది.‘‘కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం చాలా బాధాకరం. ఒక మహిళగా, అజ్ఞానాన్ని ఆమోదించడం సరైంది కాదు. రుతుస్రావం అనేది ఒక ఎంపిక కాదు. అది బయోలాజికల్ రియాలిటీ’’ అన్నారు.

‘‘నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం లక్షల మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించడమే అవుతుంది. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల సహానుభూతి లేకపోవడం, ప్రతిదానికీ మనం చేయాల్సిన పోరాటాన్ని తక్కువ చేసి చూడటం బాధాకరం. మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదు, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిది’’ అని పేర్కొన్నారు.

అసలేం జరిగింది అంటే..

రాజ్యసభ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రుతుస్రావం సమయంలో మహిళలు సెలవులు తీసుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. యజమానులు రుతుక్రమ సెలవులు తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. దీనిపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వేతనంతో కూడిన రుతుస్రావ సెలవుల విధానాన్ని ఆమె వ్యతిరేకించారు, ఇది శ్రామిక శక్తిలో మహిళలపై వివక్షకు దారితీస్తుందని అన్నారు.

‘‘పీరియడ్స్‌ ఒక వైకల్యం కాదు. ఇది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. దీనికి సంబంధించి మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుంది. నెలసరి సెలువులు ఇవ్వాల్సి రావడం వల్ల కొన్ని సంస్థలు ఆడవారిని ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు. దీని వల్ల మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది’’ అన్నారు. ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

Show comments