Hari Ramajogaiah Letter: పవన్, చంద్రబాబుకు హరిరామ జోగయ్య ఘాటు లేఖ.. ‘మీ ఖర్మ.. నేనేం చేయలేను’

పవన్, చంద్రబాబుకు హరిరామ జోగయ్య ఘాటు లేఖ.. ‘మీ ఖర్మ.. నేనేం చేయలేను’

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబులను ఉద్దేశిస్తూ హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు.. మీ ఖర్మ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఆ వివరాలు..

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబులను ఉద్దేశిస్తూ హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు.. మీ ఖర్మ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఆ వివరాలు..

మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య.. వరుస లేఖలతో జనసేన పార్టీకి, దాని అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. పొత్తుల ప్రకనట వెలువడిన నాటి నుంచి పవన్‌కు అనేక సలహాలు ఇస్తూ వచ్చారు హరి రామ జోగయ్య. సీట్ల విషయంలో జనసేన బలంగా ఉండాలని.. కనీసం 50-60 సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీకి రాజ్యాధికారం సాధ్యం అవుతుందని సూచిస్తూ వస్తున్నారు. కానీ పవన్‌ మాత్రం ఆయన మాటలు లెక్క చేయడం లేదు.

ఇక తాజాగా సీట్ల పంపిణీ వ్యవహారంలో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడపై హరిరామ జోగయ్య మండి పడ్డారు. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలకు ఏం చేబుతావని ప్రశ్నించారు. దీనిపై కూడా పవన్‌ స్పందన కరువు. అలానే తాడేపల్లి గూడెం సభ నేపథ్యంలో కూడా ఓ లేఖ రాశారు. కానీ ఫలితం శూన్యం. ఈక్రమంలో తఅయితే తాజాగా ఆయన పవన్, చంద్రబాబులకు మరో సంచలన లేఖ రాశారు. ఇకపై తాను జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోనని హరిరామ జోగయ్య వెల్లడించారు. ఆ వివరాలు..

తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ ముందు వరకు కూడా హరిరామ జోగయ్య పవన్‌ కళ్యాణ్‌ను సీట్ల పంపకం గురించి ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ ఆయన రాసిన ఒక్క లేఖపై కూడా పవన్‌ స్పందించలేదు. దాంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘తెలుగుదేశం, జనసేన కూటమి బాగుకోరి నేను ఇప్పటివరకు సలహాలు ఇచ్చాను… కానీ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు అవి నచ్చినట్లు లేవు. అది వారి ఖర్మ.. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అంటూ హరిరామ జోగయ్య బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరుపార్టీల పొత్తు నుండి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వరకు ఆయన ఇచ్చిన ఏ సలహాలను, సూచనలను ఈ ఇద్దరు నేతలు పట్టించుకోలేదు. అందువల్లే హరిరామ జోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే తెలుగుదేశం‌-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ బహిరంగ సభకు ముందు కూడా హరిరామ జోగయ్య పవన్ కు లేఖ రారు. తాడేపల్లిగూడెం సభా వేదికగా బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని ఆయన లేఖలో కోరారు. రాజ్యాధికారం సాధించాలంటే.. అధికారంలో సగబాగం జనసేనకు దక్కాలి.. పవన్‌కు గౌరవప్రదమైన హోదా, మంచి పదవి దక్కాలని హరిరామ జోగయ్య ఆశించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలు పవన్‌కు దక్కాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

అంతేకాక ఈ అంశాలపై తాడేపల్లిగూడెం సభలో స్పష్టత ఇవ్వాలని.. లేదంటే తాను వేరే నిర్ణయాలు తీసుకుంటానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. అయినా సరే బుధవారం జరిగిన తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబుగాని, పవన్ గానీ హరిరామ జోగయ్య సంధించిన అంశాలగురించి మాట్లాడలేదు. దీంతో తీవ్ర అసహానికి గురయిన ఆయన ఈ కూటమికి ఇక సలహాలివ్వడం మానేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు తెలియజేశారు.

Show comments