Rajat Patidar: పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించిన రజత్ పాటిదార్.. సిక్సర్ల వర్షం!

Rajat Patidar: పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించిన రజత్ పాటిదార్.. సిక్సర్ల వర్షం!

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లపై ఉన్నంతసేపు సిక్సర్ల వర్షం కురిపించాడు.

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లపై ఉన్నంతసేపు సిక్సర్ల వర్షం కురిపించాడు.

IPL 2024 సీజన్ లో భాగంగా ధర్మశాల వేదికగా తాజాగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. తనకు లభించిన లైఫ్ తో రెచ్చిపోయిన పటిదార్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు. మరో ఎండ్ లో కోహ్లీ ఉన్నప్పటికీ.. ఆడియన్స్ అటెన్షన్ మెుత్తం తనమీదే ఉందంటే.. అతడు ఎంతలా చెలరేగాడో అర్ధం చేసుకోవచ్చు.

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ మెరుపు అర్ధశతకంతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కు రెండో ఓవర్లోనే బ్రేక్ త్రూ ఇచ్చాడు విధ్వత్ కవెరప్ప. 2.2 బంతికి ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(9)ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత విల్ జాక్స్(12) రన్స్ కే ఔట్ చేశాడు విధ్వత్. దీంతో 43 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చాడు రజత్ పాటిదార్. అయితే కవేరప్ప బౌలింగ్ లోనే తాను ఎదుర్కొన్న రెండో బాల్ కే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ ను హర్షల్ పటేల్ వదిలేశాడు. దాంతో తనకు లభించిన లైఫ్ తో రెచ్చిపోయిన అతడు ఆ తర్వాత హర్షల్ వేసిన ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు.

ఇక రాహుల్ చహర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మూడు సిక్సులు బాది.. లైఫ్ లభిస్తే తాను ఎంత ప్రమాదకర బ్యాటరో పంజాబ్ బౌలర్లకు తెలియజెప్పాడు. ఇదే ఓవర్లో పటిదార్ కు మరో లైఫ్ లభించింది. ఈ క్రమంలోనే 21 బంతుల్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు రజత్. అయితే 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55 పరుగులు చేసి మంచి ఊపుమీదున్న అతడు సామ్ కర్రన్ బౌలింగ్ లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఇది అతడికి 4వ అర్ధశతకం కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆర్సీబీ 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ(42), గ్రీన్(0) ఉన్నారు. మరి ఈ ఐపీఎల్ లో దంచికొడుతున్న రజత్ పాటిదార్ పై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments