గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ "సత్యభామ"! ఎప్పుడంటే?

గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ “సత్యభామ”! ఎప్పుడంటే?

కాజల్ అగర్వాల్ ఎంతో మంది కుర్ర కారు హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ. ఇక పెళ్లి తర్వాత కాజల్ చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాజల్ అగర్వాల్ ఎంతో మంది కుర్ర కారు హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ. ఇక పెళ్లి తర్వాత కాజల్ చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

తీసిన కొన్ని చిత్రాలతోనే కొంతమంది హీరోయిన్స్ అందరి మదిని దోచేస్తారు. పైగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీకి వస్తూనే ఉన్నారు. అయితే ఎంత మంది వచ్చినా కానీ.. టాలీవుడ్ చందమామ అనే పేరు మాత్రం కేవలం ఒక్క కాజల్ అగర్వాల్ కు మాత్రమే సొంతం. చాలా సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తూ.. తీసిన కొద్దీ చిత్రాలతోనే మంచి పేరును సంపాదించుకుని.. ఎంతో మంది కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ అమ్మడు. అందరిలానే ఈ అమ్మడు కూడా పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేస్తుంది అనుకున్నారు కానీ.. కాజల్ అలా చేయలేదు. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు తాజాగా కాజల్ నటించిన ఒక సినిమా గురించి వచ్చిన అప్ డేట్ తో పాటు.. ఆమెకు ఒక కొత్త ట్యాగ్ కూడా యాడ్ అయింది.

కాజల్ అగర్వాల్ ఆఖరిగా నటించిన సినిమా.. అనిల్ రావిపూడి దర్సకత్వంలో.. నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సంపాదించిన తర్వాత.. కాజల్.. లేడీ ఓరియెంటెడ్ మూవీలో సత్యభామ అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను చాలా కాలం నుంచి షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇటీవల మూవీ కి సంబంధించిన టీజర్ ను ప్రకటించిన మేకర్స్.. ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. కాజల్ లేడీ ఓరియెంటెడ్ క్యారక్టర్ లో నటించిన సత్య భామ సినిమా మే 17న థియేటర్స్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతే కాకుండా కాజల్ కు క్వీన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ ను కూడా జోడించారు.

క్వీన్ ఆఫ్ మాసెస్ అనే పేరు ఇప్పటివరకు.. కాజల్ కు సంబంధించి ఎక్కడ ఉపయోగించలేదు. ఇక ఇప్పుడు ఆమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కు ఇలాంటి ట్యాగ్ లైన్ జోడించడంతో.. కాజల్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచుకోవడమే కాకుండా.. ఆమెకు ఇచ్చిన ట్యాగ్ లైన్ తో ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లిమ్ప్స్ చూస్తుంటే.. ఈ సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సత్యభామ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Show comments