iDreamPost

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు : సాదుద్దీన్ కు 3రోజుల కస్టడీ

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు : సాదుద్దీన్ కు 3రోజుల కస్టడీ

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడికి సమీపంలోని నిర్జన ప్రదేశంలో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ వేసున్న కారులో విదేశీ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన కేసులో.. ప్రధాన నిందితుడిగా అరెస్టైన సాదుద్దీన్ ను పోలీసులు మూడ్రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు రేపట్నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. తొలుత సాదుద్దీన్ ను ఏడ్రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు మూడ్రోజులే అనుమతిచ్చింది.

బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయగా.. ఐదుగురు మైనర్లే కావడంతో వారందరినీ జువైనల్ హోమ్ కు తరలించిన విషయం తెలిసిందే. మే 28న జరిగిన ఈ అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను కూడా కస్టడీకి తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ.. పోలీసులు జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన అనంతరం జువైనల్ జస్టిస్ కోర్టు మైనర్ల కస్టడీపై తుది నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. సాదుద్దీన్ మూడ్రోజుల కస్టడీ పూర్తయ్యాక.. నాల్గవ రోజు ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్ కు పంపనున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి