DC vs GT Rishabh Pant Last Over Thunder Batting: వీడియో: చివరి ఓవర్​లో పంత్ విధ్వంసం.. ఊహకందని రీతిలో..!

Rishabh Pant: వీడియో: చివరి ఓవర్​లో పంత్ విధ్వంసం.. ఊహకందని రీతిలో..!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఊహకందని రీతిలో చెలరేగిన యంగ్ బ్యాటర్.. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఊహకందని రీతిలో చెలరేగిన యంగ్ బ్యాటర్.. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. గుజరాత్ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు పంత్. అతడి ఇన్నింగ్స్​లో 5 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉండటం విశేషం. ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడిన పంత్.. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్​లో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్​లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడతను.

ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్​లో జూలు విదిల్చిన పంత్ తొలి బంతికి డబుల్ తీశాడు. ఆ తర్వాతి బంతి వైడ్ అవడంతో మరో రన్ స్కోర్ బోర్డు మీద చేరింది. అనంతరం ఐదు బంతుల్లో నాలుగు భారీ సిక్సులు బాదాడు పంత్. అలాగే ఓ బౌండరీ కూడా కొట్టాడు. దీంతో 200 చేరితే గొప్ప అనుకున్న డీసీ స్కోరు కాస్తా 224కు చేరింది. మోహిత్ ఓవర్​లో అతడు కొట్టిన ఓ హెలికాప్టర్ షాట్ మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి. పంత్​తో పాటు స్టార్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66) కూడా మంచి ఇన్నింగ్స్​తో అలరించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26) కూడా బ్యాట్​కు పని చెప్పడంతో ఢిల్లీ భారీ స్కోరును సెట్ చేయగలిగింది. మరి.. పంత్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments