Abhilasha Sharma IAS: పెళ్లయ్యాక కలెక్టర్ అయ్యింది.. స్ఫూర్తినిచ్చే IAS స్టోరీ ఇది!

Abhilasha Sharma IAS: పెళ్లయ్యాక కలెక్టర్ అయ్యింది.. స్ఫూర్తినిచ్చే IAS స్టోరీ ఇది!

పెళ్లి అయిన తర్వాత చాలా మంది తన కలలను, ఆశయాలను మర్చిపోతుంటారు. కానీ, ఈ స్టోరీలో ఓ మహిళ పెళ్లి తర్వాత కూడా తన ఆశయాన్ని వదులుకోలేదు. కుటుంబ బాధ్యతలను మోస్తూనే.. ఐఏఎస్‌ అవ్వాలనే తన కలను రీచ్‌ అయింది. ఆమె జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లి అయిన తర్వాత చాలా మంది తన కలలను, ఆశయాలను మర్చిపోతుంటారు. కానీ, ఈ స్టోరీలో ఓ మహిళ పెళ్లి తర్వాత కూడా తన ఆశయాన్ని వదులుకోలేదు. కుటుంబ బాధ్యతలను మోస్తూనే.. ఐఏఎస్‌ అవ్వాలనే తన కలను రీచ్‌ అయింది. ఆమె జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

సంకల్ప బలం లేని లక్ష్యం గాలిలో పెట్టిన దీపం లాంటిది. కృషి, పట్టుదల ఉంటే విజయాన్ని సాధించవచ్చని.. ఇప్పటివరకు ఎన్నో సార్లు విన్నాము. ముఖ్యంగా ఒక ఐఏఎస్‌ అధికారి అవ్వాలంటే మాత్రం వాటితో పాటు దృఢ నిశ్చయం, సంకల్ప బలం, ప్రోత్సాహం కూడా అవసరం. సివిల్స్ సాధించడం అనేది ఓర్పుతో కూడిన పని. మొదటి ప్రయత్నంలోనే అందరూ దీనిని సాధించలేరు. అయితే, ఆలస్యం అయినా సరే కొందరు పట్టువదలకుండా సివిల్స్ నే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ, ఆడపిల్లలకు మాత్రం అంత సమయం ఉండదు. ఎందుకంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ వయస్సు మీద పడుతుందని పెళ్లిళ్లు చేసేస్తుంటారు. దీనితో చాలా మందికి తమ ఆశలు నెరవేరడం అనేది కలగానే మిగిలిపోతుంది. కానీ, కొంతమంది మహిళలు మాత్రం పెళ్లి తర్వాత కూడా వారి జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో.. వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని ఓ మహిళ కూడా పెళ్ళి తర్వాత ఐఏఎస్‌ సాధించిన వారే.

ఐఏఎస్‌ అవ్వాలనే ప్రయత్నంలో ఆమె మొదటి మూడు సార్లు వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంది. చివరికి అలుపెరుగని పట్టుదల నాలుగోవ సారి ఆమె కలలను నెరవేరేలా చేసింది. ఆమె మరెవరో కాదు సివిల్స్‌లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ కైవసం చేసుకున్న అభిలాష శర్మ. ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. హర్యానాలో జన్మించిన అభిలాష శర్మ 2013లో యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరేషన్‌ను మొదలుపెట్టింది. అప్పటి నుంచి తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. కానీ, మొదటి మూడు సార్లు కూడా ఆమె విఫలం అయ్యింది. దీనితో ఆమె నిరాశ చెంది, ఐఏఎస్‌ అవ్వాలనే ఆశలను మెల్ల మెల్లగా కోల్పోయింది. అదే సమయంలో 2017లో అంకిత్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది.

వివాహం తర్వాత తన భర్త, కుటుంబీకుల ప్రోత్సాహంతో మరల తన సాధనను కొనసాగించింది. ఎట్టకేలకు ఆమె నాలుగోవ ప్రయత్నంలో సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. తన సక్సెస్‌పై అభిలాష మాట్లాడుతూ.. “వైఫల్యాలు విజయానికి సోపానాలు అన్నట్లుగా నేను నా లోపాలపై పని చేశాను. నన్ను నేను ఉత్సాహపరుచుకుంటూ రోజుకు 15 నుంచి 16 గంటల పాటు కఠిన అధ్యాయాల మీద సాధన చేసేదాన్ని. ప్రాక్టీస్ లో భాగంగా ప్రతి రోజు వార్త పత్రికలను చదవడం దిన చర్యలో భాగంగా మార్చుకున్నాను. ఈ విజయాన్ని భర్త అంకిత్ కు అంకితం చేస్తున్నాను” అని చెప్పింది. అలాగే ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యే వాళ్ళు కచ్చితంగా కరెంట్ అఫైర్స్‌, ఆప్టిట్యూడ్ పై పూర్తి అవగాహనా ఉండాలని అభిలాష సూచించింది. చదివేటపుడు సరైన శ్రద్ధ చూపకపోతే.. అది కూడా అడ్డంకిగా మారవచ్చని ఆమె పేర్కొంది. ఏదేమైనా, అభిలాష స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతో మంది మహిళలకు ఆదర్శం. కలలను సాకారం చేసుకోవడానికి ఎటువంటి బాధ్యతలు అడ్డు రావని.. సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చని ఈ ఐఏఎస్‌ అధికారి నిరూపించింది. మరి, కలలను నిజం చేసి దృఢ సంకల్పానికి ఉదాహరణగా నిలిచిన అభిలాష శర్మ సక్సెస్ స్టోరీపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments