Negligence of Doctor in Warangal: ఫోన్‌లో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సు.. చివరికి..

ఫోన్‌లో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సు.. చివరికి..

Negligence of Doctor in Warangal: ఇటీవల కొంతమంది వైద్యులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. నర్సుకు సెల్ ఫోన్ లో ట్రీట్ మెంట్ చేయమని చెప్పిన పాపానికి దారుణం జరిగింది.. ఎక్కడంటే?

Negligence of Doctor in Warangal: ఇటీవల కొంతమంది వైద్యులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. నర్సుకు సెల్ ఫోన్ లో ట్రీట్ మెంట్ చేయమని చెప్పిన పాపానికి దారుణం జరిగింది.. ఎక్కడంటే?

ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫోన్ ద్వారా కేవలం సంభాషనలు మాత్రమే జరిగేవి. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎదుటివారితో డైరెక్ట్ గా వీడియో, చాటింగ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఒక్కటి ఉంటే చాలు మన చేతిలో ప్రపంచం ఉన్నట్టే అంటున్నారు. ఈ అభవృద్ది మంచిదే అయినా.. దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. గూగుల్ లో దానికి సంబందించిన మెడిసన్స్ గురించి సర్చ్ చేసి సొంతవైద్యం చేసుకుంటున్నారు. యూట్యూబ్ చూసి ఆపరేషన్లు చేస్తున్నారు..దీని వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓ డాక్టర్ ఫోన్లో సూచన ఇస్తుంటే.. నర్సు గర్భిణికి ఆపరేషన్ చేసింది.. చివరికి దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పితో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు. దాంతో పుట్టిన మగశిశువు ఒకరోజు తర్వాత చనిపోయాడు. డాక్టర్, నర్సుల నిర్లక్ష్యం వల్లనే బిడ్డ చనిపోయిందంటూ పోలీసులకు బిడ్డ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గుండెపూడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్ భార్య బేబీ శ్రీజ పురుటి నొప్పులు రావడంతో ఈ నెల 16న వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని నరేశ్ కుటుంబ సభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు.. కానీ డాక్టర్ ఏదీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత నొప్పులు తీవ్రం కావడంతో స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎమ్ లు శ్రీజ పరిస్థితి డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పారు. తాను వేరే పనిలో ఉన్నానని.. ఎం చేయాలో చెబుతాను ఆ విధంగా చేయండి అని స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం లకు చెప్పింది.

ఫోన్ ద్వారా వారిద్దరికి సూచన చేయడంతో ఇద్దరు నర్సులు శ్రీజకు డెలివరీ చేశారు. మగ శిశువు పుట్టగా.. తల్లికి చూపించకుండానే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ శిశువు   చికిత్స పొందుతూ కన్నుముసింది. తమ బిడ్డ చనిపోవడానికి డాక్టర్ నిర్లక్ష్యం, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం నిర్లక్ష్యం అంటూ శ్రీజ భర్త నరేశ్ వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా డాక్టర్ ఫోన్ లో సూచనలతో డెలివరీ చేసినట్లు స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం లు ఒప్పకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముగ్గురుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.

Show comments