KTR-Multilevel Car Parking Project, Nampally: కారు పార్కింగ్‌ కోసం మల్టీ లెవల్‌ బిల్డింగ్‌.. KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్

కారు పార్కింగ్‌ కోసం మల్టీ లెవల్‌ బిల్డింగ్‌.. KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఒకటి ఆసక్తికరంగా మారింది. ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట హల్చల్‌ చేస్తున్నాయి. ఆ వివరాలు..

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఒకటి ఆసక్తికరంగా మారింది. ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట హల్చల్‌ చేస్తున్నాయి. ఆ వివరాలు..

నేటి కాలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అడుగు స్థలం వేల రూపాయల ధర పలకుతుంది. ఇక హైదరాబాద్‌ వంటి నగరాల్లో అయితే భూమల ధర కోట్ల రూపాయలు ఉంది. ఇల్లు కట్టడానికే జాగా దొరకని పరిస్థితులు. ఇక నేటి కాలంలో ఇంటికో వాహనం తప్పనిసరి అయ్యింది. ఇంటికి కనీసం ఒక కారు, బైక్‌ కచ్చితంగా ఉంటున్నాయి. కొందరికి అయితే రెండు ఉంటాయి. ఇక నేటి కాలంలో నగరాల్లో ఎక్కువగా కనిపించే సమస్య పార్కింగ్‌ ప్లేసులు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌కు అయితే ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం ఉంటుంది. కానీ గల్లీల్లో ఉండే బిల్డింగ్‌లకు పార్కింగ్‌ ప్లేస్‌ చాలా పెద్ద సమస్యగా మారింది. రానున్న కాలంలో ఇది మరింత తీవ్రం కానుంది. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం వినూత్న ఆలోచన తెర మీదకు వచ్చింది. అదే మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ బిల్డింగులు. దీనిపై కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో ఇప్పుడిది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ విశ్వనగరంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలన్ని భాగ్యనగరంలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక నగరంలో అత్యాధునిక సదుపాయాలతో పాటు, మెరుగైన రవాణా వ్యవస్థ, ప్రత్యేక ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాసులు నిర్మించడంతో టాఫ్రిక్‌ సమస్య లేకపోవడం వంటివి.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చింది. అయితే నగరంలో ప్రధాన సమస్య పార్కింగ్‌ ప్లేస్‌.

దీనిపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఓ వినూత్న ఆలోచన చేసింది. నగరంలో మల్టీ లెవల్‌ కారు పార్కింగ్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌ పక్కన ఈ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. త్వరలోనే ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. అత్యాధునిక వసతులతో 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ భవనాన్ని నిర్మించారు. మెస్సర్స్‌ భారీ ఇన్ఫ్రా ప్రైవేట్‌ లిమిటెట్‌ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. దేశంలోనే ప్రప్రథమంగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్క్‌ చేసేలా ఈ కాంప్లెక్‌ నిర్మాణం చేపట్టారు. అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా నిర్మాణం చేపట్టారు.

అందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌కు కేటాయించగా.. మిగిలిన 5 అంతస్తుల్లో కమర్షియల్ దుకాణాలు, రెండు స్కీన్లతో ఒక సినిమా థియేటర్ నిర్మించారు. పార్కింగ్ ప్రదేశాల్లో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. కొవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యమైందని గతంలో అధికారులు స్పష్టం చేశారు.

ఇక తాజాగా ఈ కారు పార్కింగ్‌ ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. దాంతో ఇప్పుడీ భవనం గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2012-17లో పీపీపీ విధానంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిచాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యమైంది. కానీ చివరకు సాకారం అయ్యింది. దీని పట్ల నేను చాలా ఆనందిస్తున్నాను. రేవంత్‌ సర్కార్‌ దీన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Show comments