Rains In AP: మండే ఎండల్లో ఏపీ ప్రజలకు చల్లని కబురు!

Rains In AP: మండే ఎండల్లో ఏపీ ప్రజలకు చల్లని కబురు!

మార్చి నుంచి భానుడి భగభగలకు ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

మార్చి నుంచి భానుడి భగభగలకు ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు భయంతో బయటకు రావడమే మానేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఇళ్లల్లో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల నుంచే ఎండలు మొదలవుతున్నాయి. అధికార్లు అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక శీతల పానియాల వెంట పడుతున్నారు. వడదెబ్బ కారణంగా పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం 43 నుంచి 45 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రీల్ నెలలో ఉష్ణోగ్రతులు ఏకంగా 45 డిగ్రీలకు చేరుకుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు చూస్తే ఏడు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఇటీవల అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలో గరిష్టంగా 44.9ల వరకు ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అకస్మాత్తుగా వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు వర్షం.. మరోవైపు వడగాల్పులు. ఈ పరిస్థితిలో మూడు రోజుల పాటు కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద దక్షిణ చత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నదని ఐఎండీ తెలిపింది. ఏపీ, యానాం దక్షణ దిశగా లేదంటే నైరుతీ దిశగా గాలులు వీస్తున్నాయి.

ఈ క్రమంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం లో తెలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. మెరుపులు, ఉరుములు ఈదరు గాలులుల గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాయలసీమలో శని, ఆది, సోమవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఒకటీ రెండు చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎండదెబ్బ కొట్టకుండా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సీజనల్ పండ్లు తినడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఎండ్లలో వర్షాలు కురవబోతున్నాయి.. అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments