Bengaluru Rains: బెంగళూరు ఒక్కసారిగా మారిన వాతావరణం.. కుంభవృష్టితో ప్రజలు అతలాకుతలం!

బెంగళూరు ఒక్కసారిగా మారిన వాతావరణం.. కుంభవృష్టితో ప్రజలు అతలాకుతలం!

Bengaluru Rains: మొన్నటి వరకు ఎండలతో మండిపోయిన బెంగుళూరు ఒక్కసారిగా చల్లబడిపోయింది. వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Bengaluru Rains: మొన్నటి వరకు ఎండలతో మండిపోయిన బెంగుళూరు ఒక్కసారిగా చల్లబడిపోయింది. వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటీవల బెంగుళూరులో ఎండల ప్రభావంతో ప్రజలు నీటి కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భూమిలో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో నీటి ఎద్దడి మొదలైంది. నీటి కష్టాలు భరించలేక చాలా మంది తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. కోట్లు పెట్టి విల్లా, అపార్ట్ మెంట్స్ కొన్నవాళలు రోడ్డుపైకి వచ్చి మంచినీళ్లు మహాప్రభో.. అంటూ ఆర్తనాధాలు చేశారు. నీటి సమస్యను కొంతమంది ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు క్యాష్ గా మార్చుకున్నారు. అధిక డబ్బులు వసూళ్లు చేస్తూ అడ్డగోలుగా దోచుకున్నారు. అలాంటిది ఇప్పుడు బెంగుళూరు తడిసి ముద్దైంది.. ఎక్కడ చూసినా చిన్నపాటి నీటి కుంటలు తలపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మొన్నటి వరకు ఎండలతో బెంబేలెత్తిపోయిన బెంగుళూరు ఇప్పుడు వర్షం నీటితో తడిసి ముద్దైంది. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగు నీటి సమస్య ఎదురైంది. దీంతో సిటీలో ఉన్నప్రజలు మంచి నీటికోసం యుద్దమే చేయాల్సి వచ్చింది. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఒకదశలో స్నానాలు చేయడానికి చుక్క నీళ్లు లేక అవస్థలు పడ్డారు. మంచి నీటి కష్టాల నుంచి ప్రజలను రక్షించాలని ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున గొడవలు చేశారు. అలాంటిది బెంగాల్ లో సోమవారం నుంచి అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. మేఘాలు కమ్ముకొని వాతావరణం మొత్తం చల్లబడి పోయింది. మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ బెంగాల్ వాసులు అకస్మాత్తుగా వాతావరణం మారి వర్షాలు పడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వీధులు, రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదరు గాలులతో కుండపోత వర్షం పడింది. ఎక్కడ చూసినా రోడ్లు జలమయం అయ్యాయి.. వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ భారత్ కు చెందిన కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ద్రోణి కారణంగా మూడు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని. ఉరుములు, మెరుపులు, ఈదరు గాలులతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.వాతావరణంలో మార్పులు సంభవించి కొంత మేర వేడి గాలుల ప్రభావం తగ్గుతుందని తెలిపింది. మొత్తానికి బెంగుళూరు వాసులకు ఎండ కష్టాలతో పాటు నీటి కష్టాలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments