Ap Rains: APని ముంచెత్తుతున్న వానలు! హమ్మయ్య ఎండల నుండి కాస్త రిలీఫ్!

APని ముంచెత్తుతున్న వానలు! హమ్మయ్య ఎండల నుండి కాస్త రిలీఫ్!

ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. బయటకు రావాలంటే భయపడిపోయారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎప్పుడు వానలు కురస్తాయని ఆశగా ఎదురు చూశారు. వాాతావరణ శాఖ ఇచ్చే రెయిన్ అప్ డేట్స్ కోసం వెయిట్ చేశారు. అయితే ఐఎండీ అంచనా వేసినట్లుగానే..

ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. బయటకు రావాలంటే భయపడిపోయారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎప్పుడు వానలు కురస్తాయని ఆశగా ఎదురు చూశారు. వాాతావరణ శాఖ ఇచ్చే రెయిన్ అప్ డేట్స్ కోసం వెయిట్ చేశారు. అయితే ఐఎండీ అంచనా వేసినట్లుగానే..

‘ఎండలు బాబోయ్ .. మాయదారి ఎండలు.. చస్తున్నాం ఈ ఎండలతోటి’ అంటూ ప్రతి ఒక్కరూ తిట్టుకోవడమే. పట్నం నుండి పల్లెటూరి వరకు ప్రతి ఒక్కరిని ఠారెత్తించాయి. ఉక్కపోతతో అల్లాడిపోయారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు. బయటకు అడుగుపెట్టాలంటే వణికి పోయారు. ఉదయం 7 గంటల నుండి సూర్యుడు నిప్పులు కురిపించాడు. సాయంత్రం అయినా వాతావరణం చల్లబడక.. ఇంటికి వచ్చి ఏసీ, కూలర్స్ ఆన్ చేసినా.. ఈ ఎండల ధాటికి చల్లదనం సరిపోక సతమతమయ్యారు. అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఎండల నుండి కాస్త ఉపశమనం లభించింది. తెలంగాణతో పాటు ఏపీలో పలు చోట్ల వాన దేవుడు కరుణించాడు.

తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వానలు కురిశాయి. తెలంగాణలో ఈ నెల 7 నుండి మూడు రోజుల పాటు వర్షాలు కురస్తాయని వాతారవణ కేంద్రం తీపి కబురు చెప్పింది. అలాగే ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో ఉన్నపాటుగా వానలు కురియడంతో.. అందులో తడిసి ముద్దయ్యారు ప్రజలు.  శ్రీకాకుళం నుండి విజయనగరం, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కాసేపటికి వాన పడటంతో ఎండల వేడిమితో చిర్రాకు పడ్డ స్థానికులు.. స్వాంతన చెందారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వాన కురిసింది. ఇది ఇలా ఉంటే చిన్న పాటి వర్షాలకే రోడ్డు జలమయమ్యాయి.

కాగా, మంగళవారం నుండి పలు జిల్లాల్లో వానలు కురస్తాయని విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించిన సంగతి విదితమే. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు,ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురు మొదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన రెయిన్స్ పడతాయని, ఈ నేపథ్యంలో రైతులు పొలాల్లోకి వెళ్లొద్దని సూచించింది. చెట్లు, టవర్స్, పోల్స్, బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. అంచనా వేసినట్లుగానే ఏపీలో పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఇక్కడ కూడా మూడు నుండి ఐదు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురియవచ్చునని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా వానలు కురియడంతో ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు.

Show comments