OTT Movie Suggestion: హర్రర్ మూవీస్ అంటే భయం లేదా?OTTలోని ఈ మూవీకి పక్కా వణికిపోతారు!

OTT Movie Suggestion: హర్రర్ మూవీస్ అంటే భయం లేదా?OTTలోని ఈ మూవీకి పక్కా వణికిపోతారు!

హర్రర్ సినిమలంటే భయం ఉన్న వాళ్ళు కూడా వీటినే చూడడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం పక్కన ఎవరు లేకుండా అసలు చూడకూడని సినిమా.. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ అయితే కనుక వెంటనే చూసేయండి.

హర్రర్ సినిమలంటే భయం ఉన్న వాళ్ళు కూడా వీటినే చూడడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం పక్కన ఎవరు లేకుండా అసలు చూడకూడని సినిమా.. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ అయితే కనుక వెంటనే చూసేయండి.

ఒకటి రెండు సినిమాలైతే ఏది బావుంది ఏది బాలేదు అని ఈజీగా చెప్పేయొచ్చు. కానీ, ఇప్పుడు ఓటీటీ పరిస్థితి అలా లేదు, వద్దన్నా కూడా సినిమాలు వరుసగా వచ్చి పడుతూనే ఉంటాయి. దీనితో కొన్ని సినిమాలను అనుకోకుండా మిస్ చేస్తూ ఉంటున్నారు మూవీ లవర్స్. మంచి సినిమాలను మిస్ చేసి.. ఓటీటీ లో ఏమి బెస్ట్ మూవీస్ ఉన్నాయా అని సెర్చ్ చేసేస్తారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. అందులోనూ హర్రర్ మూవీ. హర్రర్ మూవీస్ లో కూడా రకరకాల జోనర్స్ ఉంటాయి.. కొన్ని సీట్ ఎడ్జ్ లో కుర్చోపెడితే.. మరికొన్ని చెమటలు పట్టించేస్తుంటాయి. ఇంకా కొన్ని సినిమాలైతే వారం పది రోజుల వరకు మైండ్ లో నుంచి బయటకు వెళ్లవు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. పైగా తెలుగులో కూడా ఈ సినిమా ఉంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాలో జో అనే వ్యక్తి ఓ టికెట్ కలెక్టర్ .. వర్క్ పైన ఎక్కువ డెడికేషన్ తో ఉంటాడు. కానీ అతని కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కదు. ఓ రోజు తన కొలీగ్ రాకపోవడంతో జో సెకండ్ షిఫ్ట్ కూడా చేయాల్సి వస్తుంది. దీనితో తనకు ఇష్టం లేకపోయినా.. ఆరోజు నైట్ చివరి ట్రెయిన్‌కు టికెట్ కలెక్టర్‌గా వెళ్తాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్నే మార్చేస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆరోజు అర్ధరాత్రి ఎక్కడో తెలియని ప్రాంతంలో ఆ ట్రైన్ ఓ దట్టమైన అడవి మధ్యలో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఎందుకు ఆగిందా అని దిగి ఆరా తీసేలోపే.. ఓ వింత జీవి వచ్చి ఆ ట్రైన్ డ్రైవర్ ను చంపి తినేస్తుంది. ప్రయాణికులంతా ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అక్కడినుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్దాం అని బయలుదేరుతుండగా.. అక్కడ పెద్దావిడ కాలికి గాయం అవుతుంది. అప్పటినుంచి ఆమె కూడా ఓ వింత జీవుల మారిపోతుంది. ఎవరికీ ఏమి అర్థంకాదు.. అసలు ఆ తర్వాత ఏమి జరిగింది ! ఆ వింత జీవి నుంచి ఎలా తప్పించుకున్నారు ! అసలు ఆ వింత జీవి ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు “హౌల్”. ఇది ఒక హాలీవుడ్ సినిమా అయినప్పటికీ.. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఏ హర్రర్ చిత్రంలో అయినా మెయిన్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఈ సినిమాలో ప్రతి క్యారక్టర్ కూడా చూసేవాళ్లకు థ్రిల్లింగ్ ఫీల్ ను కలిగిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా.. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. 2015 లో వచ్చిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments