Delhi HC Rejects Kejriwals Plea: CM కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు..

CM కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు..

Delhi HC Rejects Kejriwals Plea: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెను సంచలనాలు సృష్టిస్తుంది. ఈ కేసులో పెద్ద హూదాలో ఉన్న వాళ్లను అరెస్ట్ చేశారు ఈడీ.

Delhi HC Rejects Kejriwals Plea: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెను సంచలనాలు సృష్టిస్తుంది. ఈ కేసులో పెద్ద హూదాలో ఉన్న వాళ్లను అరెస్ట్ చేశారు ఈడీ.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలో పెను సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టులో నిశాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే..

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అంటున్నారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయనపై కక్ష్య సాధింపు చర్యలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్ పై వేసిన పిటీషన్ అత్యవసర విచారణ కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్ట్ చేయడంపై శనివారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో తన అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్దమని, తనని వెంటనే రిలీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును అత్యవసర విచారణ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. శనివారం లేదా ఆదివారం విచారించాలని కోరారు. కానీ కేజ్రీవాల్ పిటీషన్ ని కోర్టు నిరాకరించింది. హూలీ సెలవుల తర్వాత బుధవారం మార్చి 27 విచారణ చేపడతామని అప్పటికి కోర్టు విచారణ జాబితా చేస్తున్నట్లుగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని గత గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Show comments