Mukhyamantri Mahila Samman Yojana: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల రూ. 1000 ఇవ్వనున్న ప్రభుత్వం

మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల రూ. 1000 ఇవ్వనున్న ప్రభుత్వం

మహిళల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం అద్భుతమైన పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ప్రతి నెల రూ. 1000 ఉచితంగా అందించనుంది.

మహిళల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం అద్భుతమైన పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ప్రతి నెల రూ. 1000 ఉచితంగా అందించనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కొన్ని ఉచిత పథకాలు ప్రకటిస్తూ.. మరికొన్ని పెట్టుబడి పథకాలను ప్రవేశపెడుతున్నాయి ప్రభుత్వాలు. పోస్టాఫీస్ పథకాలు, సుకన్య సమృద్దియోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడులు అందుకుంటున్నారు. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రతీ నెల ఆర్థిక సాయం అందించే విధంగా స్కీమ్స్ ను కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1000 అందించనుంది.

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కేజ్రీవాల్ సర్కార్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన్​ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. వెయ్యి ఫ్రీగా అందించనుంది. ఆర్థికశాఖ మంత్రి అతిషి ఈ పథకాన్ని ప్రకటిస్తూ దీని కోసం రూ. 2,714 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలిచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మహిళల వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. ఢిల్లీ ఓటర్ అయి ఉండాలి. ప్రభుత్వం అందించే ఇతర పథకాల లభ్ధిదారులై ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. ఇక ఈ పథకం పార్లమెంట్ ఎలక్షన్స్ అనంతరం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments