Delhi CM Arvind Kejriwal: బ్రేకింగ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్! ఎప్పటి వరకు అంటే?

బ్రేకింగ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్! ఎప్పటి వరకు అంటే?

Delhi CM Arvind Kejriwal: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. ఈ సమయంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేశారు..ఆయన కేసు సుప్రీంకోర్టు విచారిస్తుంది.

Delhi CM Arvind Kejriwal: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. ఈ సమయంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేశారు..ఆయన కేసు సుప్రీంకోర్టు విచారిస్తుంది.

దేశంలో ఢిల్లీ లిక్కర్ కేసు పెను సంచలనాలకు దారి తీసిన విషయం తెలిసిందే. 2021-22 నాటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 21 న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.సీఎం కేజ్రీవాల్ తనకు మధ్యంతర బెయిల్ కావాలని కోరుతూ సుప్రీం కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.మంగళవారం ఈ పిటీషన్ పై విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల దృష్ట్యా మంధ్యంతర బెయిల్ పై విడుదలైతే కేజ్రీవాల్ తన అధికారిక విధులు నిర్వర్తించకూడదని కోరింది. అనంతరం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో భారీ ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మొత్తానికి మద్యం పాలసీ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. ఇటీవల ఆయనను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ శుక్రవారం మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21 న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకు ముందు ఈ కేసు విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్ కి తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించలేదు.. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సింది కోరారు.. ఈ నేథ్యంలో మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Show comments