Dogs Name Print On Wedding Card: పెళ్లి కార్డులో శునకాల పేర్లు రాయించిన యువకుడు! కారణం అదే..!

పెళ్లి కార్డులో శునకాల పేర్లు రాయించిన యువకుడు! కారణం అదే..!

Dogs Name Print On Wedding Card: విశ్వాసానికి ప్రతీక శునకాలు అనే విషయం మనకు తెలిసిందే. ముద్ద పెట్టి ఆకలి తీర్చే యజమాని కోసం ప్రాణాలు సైతం అర్పిస్తుంటాయి.  అలాంటి కుక్కలపై ఓ యువకుడు తనకున్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడు.

Dogs Name Print On Wedding Card: విశ్వాసానికి ప్రతీక శునకాలు అనే విషయం మనకు తెలిసిందే. ముద్ద పెట్టి ఆకలి తీర్చే యజమాని కోసం ప్రాణాలు సైతం అర్పిస్తుంటాయి.  అలాంటి కుక్కలపై ఓ యువకుడు తనకున్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడు.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓ అందమైన, అరుదైన ఘటన. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని అందరు భావిస్తుంటారు. ఇక పెళ్లి కార్డు మొదలు పెళ్లి మండపం వరకు ప్రతి ఒక దానిలో ప్రత్యేకంగా ఉండాలని నేటి తరం యువత కోరుకుంటుంది. ఇక పెళ్లి కార్డులో వధువరులతో పాటు దగ్గరి వాళ్ల పేర్లు కూడా వేయిస్తుంటారు. ఇంకా దగ్గరి వాళ్లవి అయితే ప్రత్యేకంగా పెళ్లికార్డుపై వేయిస్తారు. అయితే ఎవరైనా తమ ఇంట్లో పెంచుకునే జంతుల పేర్లను పెళ్లి కార్డులో అచ్చు వేయిస్తారా?. ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం ఓ యువకుడు చెప్పాడు. తన పెళ్లి కార్డులో ఏకంగా.. తన ఇంట్లోని  పెంపుడు కుక్కల పేర్లను వేయించాడు. మరి..ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

విశ్వాసానికి ప్రతీక శునకాలు అనే విషయం మనకు తెలిసిందే. ముద్ద పెట్టి ఆకలి తీర్చే యజమాని కోసం ప్రాణాలు సైతం అర్పిస్తుంటాయి.  అందుకే చాలా మంది కుక్కులను తమ కుటుంబసభ్యులుగానే భావించి.. ప్రేమను చూపుతారు. వాటిని కన్నబిడ్డలతో సమానంగా చూసుకుని, సపర్యలు చేస్తుంటారు. అలానే కొందరు అయితే తమ ఇంట్లో జరిగే ఫంక్షన్లలో పెంపుడు జంతువులకు పెద్ద పీట వేస్తుంటారు. అలానే ఓ యువకుడు ఏకంగా తన పెళ్లి పత్రికలపై పెంపుడు శునకాల పేర్లను ముద్రించి.. ఆ మూగ జీవాలపై ప్రేమను చాటుకున్నాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర సాగర్ జిల్లాలోని రాణిపురకు చెందిన యశ్వంత్ రైక్వార్ తన పెళ్లి కార్డులో పెంపుడు శునకాల పేర్లను ముద్రించుకున్నాడు. ఐదేళ్ల క్రితం తన స్నేహితుడి యశ్వంత్ రైక్వార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో యశ్వంత్ బైక్‌ కింద ఓ కుక్క పిల్ల పడింది. అయితే, అదృష్టవశాత్తు దానికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఆ కుక్క పిల్లను తీసుకుని అతడు తన ఇంటికి వెళ్లాడు. ఆ శునకం సరదగా గడపడంతో వాటిపై యశ్వంత్ కు ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలోనే మరో మూడు కుక్కలను ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. అలా ఏళ్లు గడిచి… ఇటీవలే యశ్వంత్‌కు వివాహం జరిగింది.

ఈ క్రమంలో శునకాలపై  తనకున్న ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. పెళ్లి కార్డులో ‘భౌ భౌ’ పార్టీ పేరుతో నాలుగు శునకాలైన రాకీ, జోజో, కాలు, లాలూ పేర్లను ముద్రించాడు.  తన పెళ్లి వేడుకలో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఈ శునకాలను భాగం చేశాడు.  అతిథుల స్వాగతం పలికినట్లుగానే వాటికి మర్యాదలు చేశాడు. అలాగే, తన పెళ్లి ఊరేగింపునకు బయలుదేరే సమయంలో ఆ నాలుగు కుక్కలకు పసుపు, కుంకుమను పెట్టడం గమనార్హం. ఇలా మూగజీవాలపై యశ్వంత్ చూపిన ప్రేమకు వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక యశ్వంత్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Show comments