Bangarraju : పండగ విజేతలు అక్కినేని హీరోలే

Bangarraju : పండగ విజేతలు అక్కినేని హీరోలే

ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం బంగార్రాజుకి బాగా కలిసి వస్తోంది. ఇండస్ట్రీ రికార్డులు కాదు కానీ నాగార్జున నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ నెంబర్స్ ని నమోదు చేసే దిశగా పరుగులు పెడుతోంది. శుక్రవారంతో మొదలుపెట్టి నిన్నటిదాకా ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు వేసుకున్న ఈ ఎంటర్ టైనర్ కు మొదటి వారం చాలా కీలకంగా మారనుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా దక్కించుకున్న బంగార్రాజులో సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ కంటెంట్ లేకపోయాయినా టైం పాస్ లోటు లేకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ జాగ్రత్త పడటంతో జనాలు సంతృప్తిగానే బయటికి వస్తున్నారు.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు బంగార్రాజు మూడు రోజులకు గాను 26 కోట్లకు పైగా షేర్ దక్కించుకుంది. గ్రాస్ లెక్కలో చూసుకుంటే అది 43 కోట్ల దాకా తేలుతుంది. మొదటి రోజు కంటే నిన్న వసూళ్లు బాగుండటం గమనించాల్సిన అంశం. కుటుంబాలకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అఖండ 50 రోజుకు దగ్గరగా ఉండటం, పుష్ప ప్రైమ్ లో వచ్చేయడం, శ్యామ్ సింగ రాయ్ ఎప్పుడో స్లో అయిపోవడం లాంటి కారణాలు బంగార్రాజుకు బాగా కలిసి వస్తున్నాయి. ఈ ట్రెండ్ ని ఇలాగే కొనసాగిస్తే 40 కోట్ల బ్రేక్ ఈవెన్ ని చేరుకోవడం కష్టమేమీ కాదు. కాకపోతే ఈ వీకెండ్ లోగా ఆక్యుపెన్సీలు, నిబంధనలు ఏవీ అడ్డురాకపోతే సరి.

నైజామ్ – 6 కోట్ల 50 లక్షలు
సీడెడ్ – 4 కోట్ల 65 లక్షలు
ఉత్తరాంధ్ర – 3 కోట్లు
ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 55 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 83 లక్షలు
గుంటూరు – 2 కోట్ల 35 లక్షలు
కృష్ణా – 1 కోటి 42 లక్షలు
నెల్లూరు – 1 కోటి 12 లక్షలు

ఏపి/తెలంగాణ మూడు రోజుల షేర్ – 23 కోట్ల 60 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 50 లక్షలు
ఓవర్సీస్ – 1 కోటి 18 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల షేర్ – 26 కోట్ల 29 లక్షలు

ఇంకా బ్రేక్ ఈవెన్ కు 13 కోట్లకు పైగా రావాలి. వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేవు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని బంగార్రాజు పూర్తిగా వాడుకోవచ్చు. సూపర్ మచ్చి డిజాస్టర్ కాగా రౌడీ బాయ్స్ కూడా అద్భుతాలు చేసే సీన్ కనిపించడం లేదు. హీరో కూడా ఫైనల్ గా యావరేజ్ దగ్గరే ఆగిపోయేలా ఉంది. ఇవేవి ఫ్యామిలీ టార్గెట్ కి కనెక్ట్ కావడం లేదు. సో బంగార్రాజుకి ఇదంతా ప్లస్సయ్యే వ్యవహారమే. కాకపోతే అఖండ, పుష్పలను క్రాస్ చేయడం కాదు కదా కనీసం టచ్ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ మొదటి మూడు రోజుల్లోనే కనీసం ఓ ముప్పై కోట్ల షేర్ దాటి ఉంటే అది ఎక్స్ పెక్ట్ చేయొచ్చు కానీ ఆ సూచనలు లేవు. మొత్తానికి బంగార్రాజు హిట్టే

Also Read : Bangarraju Review : పాత బంగార్రాజే!

Show comments