iDreamPost

చోర్ బజార్ ఈవెంట్లో బండ్ల వైరల్ స్పీచ్

చోర్ బజార్ ఈవెంట్లో బండ్ల వైరల్ స్పీచ్

రేపు విడుదల కాబోతున్న ఆకాష్ పూరి కొత్త సినిమా చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఇప్పటిదాకా పెద్ద బజ్ లేదు కానీ అతిథిగా వచ్చిన బండ్ల గణేష్ పుణ్యమాని ఇప్పుడీ మూవీ టాక్స్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా పూరి జగన్నాధ్ ని నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన అన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ముందు ఆకాష్ తల్లిని ఆకాశానికెత్తేస్తూ పొగిడిన బండ్ల ఆ తర్వాత నేరుగా పూరి మీదకు వెళ్లిపోయారు. ఎక్కడో ముంబైలో కాదు ముందు ఇంటి ముందు కళ్ళాపి చల్లాలని ఎవరెవరినో స్టార్లు చేయడం కన్నా కన్న కొడుకుని పైకి తీసుకురావడం ముఖ్యమనేలా వరస కౌంటర్లతో అందరికీ షాక్ కలిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు.

చివరికి చనిపోయాక కొరివి పెట్టే సంతానం కన్నా ఏదీ ముఖ్యం కాదని హితవు పలికిన బండ్ల తాత్కాలికంగా జీవితంలో వచ్చి పోయేవాళ్లు శాశ్వతం కాదని చెప్పాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకత్వం ఎవరికీ లేకపోయింది కానీ మొత్తానికి ఈ స్థాయిలో పూరిని డైరెక్ట్ గా అడిగేసిన మొదటి వ్యక్తి బండ్లనే అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది హీరోకి దర్శకుడికి మంచి కంబ్యాక్ గా నిలిచింది. అంతకు ముందు పోకిరిలో జర్నలిస్ట్ గా చేసిన తక్కువ సీన్లతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు గణేష్. ఆ అభిమానంతో వచ్చిన మాటలే ఇవి.

విశ్వక్ సేన్ తో పాటు మరికొందరు గెస్టులుగా వచ్చిన చోర్ బజార్ వేడుక బాగానే సక్సెస్ అయ్యింది. ఈవెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే బుకింగ్స్ వీక్ గా ఉన్న ఈ మూవీ పూర్తిగా పబ్లిక్ టాక్ మీదే ఆధారపడి ఉంది. ఆకాష్ పూరి ఇందులో టైర్ల దొంగగా నటిస్తున్నాడు. ఓ వజ్రం చుట్టూ తిరిగే కథగా దర్శకుడు జీవన్ రెడ్డి దీన్ని సస్పెన్స్ కం క్రైమ్ డ్రామాగా రూపొందించారు. రేపు పోటీగా చాలా సినిమాలు ఉన్నప్పటికీ అంతో ఇంతో హైప్ ఉన్నది సమ్మతమే, చోర్ బజార్ లు రెండే. బాక్సాఫీస్ దగ్గర అన్ని కొత్త రిలీజులు స్లో అయిపోయిన నేపథ్యంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు ఈజీగా మంచి లాభాలతో గట్టెక్కవచ్చు. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి