AP Govt-Rabi Season Pulse Collection: AP రైతులకు శుభవార్త.. రూ.5 వేల నుంచి రూ.8,500 వరకు

AP రైతులకు శుభవార్త.. రూ.5 వేల నుంచి రూ.8,500 వరకు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి పంట సేకరణకై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి పంట సేకరణకై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అంతేకాక దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను ఆదుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వారికి పెట్టుబడి సాయం అందించడం మాత్రమే కాక.. మద్దతు ధర అందిస్తూ.. ప్రకృతి వైపరీత్యాల వేళ నష్టపపోయిన రైతులకు పంట పరిహారం అందిస్తూ.. వారికి అన్ని విధాల అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు మరోసారి శుభవార్త చెప్పారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

తాజాగా ఏపీ ప్రభుత్వం రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇచ్చింది. ఇక ప్రభుత్వ నిర్ణయం వల్ల.. ఆర్బీకేల ద్వారా ఆయా పంటల కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని ఏపీ మార్క్‌ఫెడ్‌ అంచనా వేసింది.

పంట కొనుగోళ్లతో పాటు.. కనీస మద్దతు ధరను కూడా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా శనగలు క్వింటాల్‌కు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధరగా ప్రకటించింది. అలాగే కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది.

అయితే పంట నమోదు (ఈ–క్రాప్‌) ఆధారంగానే ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు ఏపీ అధికారులు. పంట కోతల తేదీ ఆధారంగా.. వాటి కొనుగోలు తేదీని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్‌ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్‌ కోడ్‌/ఆర్‌ఎఫ్‌ ఐడీ ట్యాగ్‌ వేస్తున్నారు. రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని.. తొందరపడి ఏ ఒక్క రైతు కూడా తమ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.

Show comments