EAPCET State Topper: ఎప్‌సెట్‍లో స్టేట్ టాపర్‌గా ఆంధ్రా అమ్మాయి.. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యం!

ఎప్‌సెట్‍లో స్టేట్ టాపర్‌గా ఆంధ్రా అమ్మాయి.. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యం!

చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకుని.. దేశంలోనే టాప్ యూనివర్సిటీలో సీటు సంపాదించాలని.. దానికి తగ్గట్టే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పట్టుదలతో ఇవాళ స్టేట్ టాపర్ గా నిలిచింది ఏపీకి చెందిన అమ్మాయి.

చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకుని.. దేశంలోనే టాప్ యూనివర్సిటీలో సీటు సంపాదించాలని.. దానికి తగ్గట్టే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పట్టుదలతో ఇవాళ స్టేట్ టాపర్ గా నిలిచింది ఏపీకి చెందిన అమ్మాయి.

టీఎస్ ఎప్‌సెట్‍లో 2024 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగంతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఏపీ విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు. వీరిలో అన్నమయ్య జిల్లాకు చెందిన ఆలూరు ప్రణీత మొదటి ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో 89.66 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా.. ఇందులో 90.18 శాతం మంది అమ్మాయిలు ఉండగా, 88.25 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు 91,633 మంది రాయగా.. అందులో 82,163 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఈ పరీక్షల్లో ఏపీకి చెందిన ఆలూరు ప్రణీత స్టేట్ ఫస్ట్ వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ప్రణీత.. అగ్రికల్చర్, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

మదనపల్లిలోని సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్న హోమియో డాక్టర్ శ్రీకర్, సైన్స్ టీచర్ కళ్యాణిల చిన్న కుమార్తె ప్రణీత.. చిన్నప్పటి నుంచి బాగా చదివేది. చిన్న వయసు నుంచే డాక్టర్ అవ్వాలన్న లక్ష్యం ఏర్పరచుకుంది. తమ బిడ్డ స్టేట్ టాపర్ గా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు, టీచర్స్, కాలేజ్ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలిపింది. పదో తరగతిలో 589 మార్కులు, ఇంటర్ లో 992 మార్కులు వచ్చాయని ఆమె వెల్లడించింది. ఫ్యూచర్ లో కార్డియాక్ సర్జన్ అవ్వాలని అనుకుంటున్నానని.. దాని కోసం మే 15న జరిగిన పరీక్షలో 715 ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నానని తెలిపింది. ఆ ర్యాంకుని బట్టి టాప్ 1, టాప్ 2 కాలేజీల్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతానని ఆమె పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్ లో గానీ, పాండిచ్చేరి జీఎం యూనివర్సిటీలో సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నానని తెలిపింది.

ఇక ఆమె తల్లి కళ్యాణి మాట్లాడుతూ.. మా ఇద్దరు అమ్మాయిలు కూడా దేవుడు ఇచ్చిన వర ప్రసాదంగా భావిస్తున్నామని అన్నారు. ప్రణీత చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడల్స్ సాధిస్తూ వచ్చిందని.. సైన్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యి.. రెండో తరగతి నుంచే గోల్డ్ మెడల్స్ సాధించేదని.. కార్డియాక్ సర్జన్ కావాలనే చిన్నప్పటి నుంచి ఆసక్తిగా ఉందని.. దానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదువుతూ వచ్చిందని.. ఢిల్లీలో ఎయిమ్స్ యూనివర్సిటీలో చదవాలని చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకుందని అన్నారు. ఇక ప్రణీత తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చదవాలని ఆశ ఉందని.. కార్డియాలజీ చేసి కార్డియాక్ సర్జన్ అవ్వాలని ప్రణీత ఆకాంక్షిస్తుందని ఆమె తండ్రి అన్నారు. 

Show comments