Aamir Khan Ex Wife Kiran Rao On Miscarriages: ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్.. ఆమిర్ ఖాన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్.. ఆమిర్ ఖాన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అబార్షన్ గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అబార్షన్ గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

సెలబ్రిటీల్లో లవ్, బ్రేకప్ ఎంత కామనో మ్యారేజ్, డివోర్స్ కూడా అంతే సాధారణంగా మారిపోయింది. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన కొందరు కూడా ఆ తర్వాత డివోర్స్ బాట పట్టడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. అలాంటి జంటల్లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్-కిరణ్​ రావు ఒకటి. 2005లో కిరణ్​ను పెళ్లాడారు ఆమిర్. ఏళ్ల పాటు కలసిమెలసి ఉన్న ఈ పెయిర్.. 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా వీళ్ల మధ్య ఫ్రెండ్​షిప్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ ఆమిర్ నటించే సినిమాల మేకింగ్​లో కిరణ్ కీలకంగా ఉంటున్నారు. అలాంటి ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అబార్షన్ గురించి మాట్లాడుతూ ఆమిర్ మాజీ భార్య కిరణ్ ఎమోషనల్ అయ్యారు. మ్యారేజ్ తర్వాత తాను పలు చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని అన్నారు. ‘ధోబీ ఘాట్’ ఫిల్మ్ షూటింగ్ సమయంలో తన కొడుకు ఆజాద్ పుట్టాడని చెప్పారు. అప్పటికే సంతానం కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని.. ఆ ఐదేళ్లలో ఎన్నోమార్లు అబార్షన్ కూడా అయిందన్నారు. ఫిజికల్​ హెల్త్, మెంటల్ హెల్త్ తీవ్రంగా దెబ్బతిందని, సంతానం పొందడం ఇంత కష్టమా అని అనిపించిందని వాపోయారు కిరణ్ రావు. బిడ్డను కనడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న తనకు ఐవీఎఫ్-సరోగసీ ద్వారా ఆజాద్ పుట్టడంతో సంతోషంలో మునిగిపోయానని తెలిపారు. తల్లిగా అతడికి ఎంతో ప్రేమను అందించాలని నిర్ణయించుకున్నానని.. తనతో లైఫ్​ను ఆనందంగా గడుపుతున్నానని పేర్కొన్నారు ఆమిర్ మాజీ భార్య.

ఆజాద్ పుట్టిన క్షణాలు, అతడు పెరుగుతున్న రోజులు తన జీవితంలోనే బెస్ట్ డేస్ అని కిరణ్ రావు వ్యాఖ్యానించారు. పిల్లాడి కోసం పదేళ్ల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ఆ సమయంలో ఆజాద్​కు తాను టైమ్ కేటాయించానని.. అందుకు సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇక, కిరణ్​ రావు రీసెంట్​గా ఓ మూవీతో డైరెక్టర్​గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పేరు ‘లాపతా లేడీస్’. కాగా, ఆమిర్ కూడా ప్రస్తుతం ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఆయన గతంలో యాక్ట్ చేసిన ‘తారే జమీన్ పర్’కు ఇది రీమేక్​గా తెరకెక్కుతోంది. ఈ మూవీ పేరు ‘సితారే జమీన్ పర్’. మరి.. ఆమిర్​ను మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు మీరెంత ఎగ్జయిటింగ్​గా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments