మరో మహిళతో రొమాంటిక్ సీన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న స్టార్ హీరోయిన్!

మరో మహిళతో రొమాంటిక్ సీన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న స్టార్ హీరోయిన్!

మరో మహిళతో రొమాన్స్ చేసే సన్నివేశాలపై స్పందించింది స్టార్ హీరోయిన్. కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆ వివరాల్లోకి వెళితే..

మరో మహిళతో రొమాన్స్ చేసే సన్నివేశాలపై స్పందించింది స్టార్ హీరోయిన్. కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆ వివరాల్లోకి వెళితే..

‘హీరామండీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న వెబ్ సిరీస్. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకుల ప్రశంలు అందుకుంటూ ఓటీటీలో దూసుకెళ్తోంది ఈ వెబ్ సిరీస్. 1920-40 మధ్య కాలంలో లాహోర్ లో రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన ‘హీరామండి’లోని వేశ్యల జీవితాలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ ను తెరకెక్కించాడు భన్సాలీ. ఇక ఈ సిరీస్ లో మరో మహిళతో రొమాన్స్ చేసే సన్నివేశాలపై స్పందించింది స్టార్ హీరోయిన్. చాలా ఎగ్జైట్ అయ్యానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్?

మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, ఫర్దీన్ ఖాన్ లాంటి స్టార్లు నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘హీరామండి’.  సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇక ఈ సిరీస్ లో ఫరీదాన్ పాత్ర పోషించిన సోనాక్షి అద్భుత నటనతో సిరీస్ విజయానికి తోడ్పడింది. అయితే ఇందులో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించారు. మరో మహిళతో కలిసి రొమాంటిక్ సీన్స్ లో నటించడంతో.. ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆ పాత్రను సరిగ్గా చూపించలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించింది సోనాక్షి.

సోనాక్షి సిన్హా మాట్లాడుతూ..”ఫరీదాన్ పాత్ర స్వలింగ సంపర్కురాలని కథ చెప్పినప్పుడే భన్సాలీ నాకు చెప్పాడు. ఆ పాత్ర గురించి నాకు పూర్తిగా వివరించారు. కథ విన్నవెంటనే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇక ఫరీదాన్ పాత్ర స్వలింగ సంపర్కురాలు కాబట్టి.. మరో మహిళతో రొమాన్స్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. నటిగా అన్ని పాత్రలు చేయాలి” అంటూ తనపై విమర్శలు చేసే వారికి సమాధానం ఇచ్చింది. ఇక ఈ సిరీస్ లో నటుడు ఇంద్రేష్ మాలిక్ తో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది సోనాక్షి. అయితే ఈ సీన్స్ చేసేటప్పుడు తాను అసౌకర్యానికి గురైయ్యానని, సోనాక్షినే నాకు ధైర్యం చెప్పిందని నటుడు ఇంద్రేష్ పేర్కొనడం విశేషం. మరి సోనాక్షి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments